జీవీ– 2 చిత్ర కథను రెండు రోజుల్లో రాశా..! 

1 May, 2022 10:18 IST|Sakshi
జీవీ– 2 చిత్ర యూనిట్‌

సాక్షి, తమిళనాడు: జీవీ– 2 చిత్ర కథను రెండు రోజుల్లో రాసినట్లు దర్శకుడు వీజే గోపీనాథ్‌ తెలిపారు. ఈయన దర్శకత్వంలో నటుడు వెట్రి హీరోగా నటించిన జీవీ చిత్రం 2019లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. తాజాగా దీనికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రమే జీవీ –2. ఇటీవల శింబు కథానాయకుడిగా వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో మానాడు వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత సురేష్‌ కామాక్షి తన వీ హౌస్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మిస్తున్న తాజా చిత్రం ఇది.

(చదవండి: నా కెరీర్‌లో బెస్ట్‌ పాత్ర ఇదే!: మెహరీన్‌)

దర్శకుడు మాట్లాడుతూ జీవీ చిత్రానికి కథ, సంభాషణలు రచయిత బాబు తమిళ్‌ రాశారని చెప్పారు. దానికి సీక్వెల్‌ చేయాలని భావించినప్పుడు రచయిత బాబు తమిళ్‌ను సంప్రదించగా జీవీ చిత్రానికి సీక్వెల్‌ అవకాశమే లేదని చెప్పడంతో తానే కథను తయారు చేయడానికి సిద్ధమయ్యానన్నారు. అలా రెండు రోజుల్లోనే జీవీ– 2 చిత్ర కథను రాశానని తెలిపారు. చిత్ర షూటింగ్‌ పూర్తి అయ్యిందని తెలిపారు. నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు.

మరిన్ని వార్తలు