ఆ పాత్రకు కేసీఆర్‌గారే స్ఫూర్తి : జిషాన్‌ ఉస్మాన్‌

11 Nov, 2021 07:59 IST|Sakshi

‘‘తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌గారి పాత్ర చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఒక ఉద్యమకారుడిగా పోరాడి గెలిచిన అలాంటి గొప్ప వ్యక్తి పాత్రలో నటించడం నిజంగా గర్వంగా ఉంది’’ అని హీరో జిషాన్‌ ఉస్మాన్‌ అన్నారు. శ్రీకాంత్‌ ప్రధాన పాత్రలో జిషాన్‌ ఉస్మాన్‌–సుష్మిత జంటగా హరీష్‌ వడత్యా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. మొహమ్మద్‌ జాకీర్‌ ఉస్మాన్‌ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది.

జిషాన్‌ ఉస్మాన్‌ మాట్లాడుతూ– ‘‘నేను ఇంటర్‌ సెకండియర్‌లో ఉన్నప్పుడు హరీష్‌గారు నన్ను, మా నాన్నని కలిసి ‘తెలంగాణ దేవుడు’ కథ వినిపించారు. కేసీఆర్‌గారి బయోపిక్‌ అనగానే సినిమా చేయడానికి అంగీకరించాను. ఈ పాత్ర చేయడానికి కేసీఆర్‌గారే నాకు స్ఫూర్తి. తెలంగాణ గురించి గతంలో నాకు అంతగా తెలియదు. ఈ కథ విన్న తర్వాత బాగా తెలుసుకున్నాను. ఈ సినిమాలో నా పాత్ర స్కూల్‌ డేస్‌ నుంచి పెళ్లయ్యే వరకు ఉంటుంది’’ అన్నారు.

మరిన్ని వార్తలు