Jordar Sujatha: దుబాయ్‌లో ప్రేమ జంట బర్త్‌డే సెలబ్రేషన్స్‌, ఫోటోలు వైరల్‌

5 Jan, 2023 14:45 IST|Sakshi

తెలంగాణ యాసలో జోర్దార్‌గా మాట్లాడే సుజాత గురించి తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరేమో! మొదట్లో సుజాత ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌లో ఉద్యోగం చేసింది. తెలంగాణ యాసలో ఓ ప్రోగ్రామ్‌ వస్తుందంటే తన అదృష్టం పరీక్షించుకుందామని దానికి ట్రై చేసింది. ఆమె యాస నచ్చడంతో షో నిర్వాహకులు ఎంపిక చేసుకున్నారు. ఆ ప్రోగ్రామ్‌ హిట్‌ కావడం.. గలగలా మాట్లాడే సుజాతను ప్రేక్షకులు జోర్దార్‌ సుజాతగా అక్కున చేర్చుకోవడం చకాచకా జరిగిపోయాయి.

యాంకర్‌గా తనేంటో నిరూపించుకున్న సుజాత తర్వాత బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో పాల్గొంది. అనంతరం ఓ కామెడీ షోలోనూ ఎంట్రీ ఇచ్చింది. అక్కడ రాకింగ్‌ రాకేశ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అవును, ప్రేమలో పడ్డామని అంగీకరించారు. ఇక రాకేశ్‌ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా అక్కడ సుజాత ఉండాల్సిందే! అంతలా కలిసిపోయారిద్దరూ.. 

ఇటీవల వీరిద్దరూ విదేశీ విహారయాత్రకు వెళ్లారు. దుబాయ్‌లో సుజాత బర్త్‌డే(డిసెంబర్‌ 29) వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారీ లవ్‌ బర్డ్స్‌. ఇందులో ఒకరికొకరు ప్రేమగా కేక్‌ తినిపించుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.

A post shared by Rocking Rakesh (@jabardasthrakesh)

A post shared by Rocking Rakesh (@jabardasthrakesh)

A post shared by Sujatha P (@jordarsujatha)

చదవండి: బాలీవుడ్‌ నటుడు సతీష్‌ షాకు జాతి వివక్ష
హీరో కాకపోయుంటే ఆ పని చేసేవాడిని : ప్రభాస్‌

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు