ప్రేమికుల రోజు సందర్భంగా బ్లాక్‌ బస్టర్‌ సినిమా 'రీ రిలీజ్'

1 Jan, 2024 17:04 IST|Sakshi

దాదాపు పన్నెండేళ్ల క్రితం వచ్చిన 'జర్నీ' సినిమా అప్పట్లో యూత్‌ను ఎంతగానో కట్టిపడేసింది.  అంజలి, జై, శర్వానంద్, అనన్య జోడిగా ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమాను చూసిన వారందరూ ఇప్పటి జనరేషన్‌లో టువంటి అమ్మాయిలు కూడా ఉంటారా? అనేంతగా సినిమా కథలో హీరోయిన్‌ పాత్ర ఉంటుంది. ఇందులోని ప్రేమ కథలకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. మురుగదాస్ నిర్మాణం, ఎం.శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సీ.సత్య సంగీతం అందించారు. అప్పట్లో ప్రేక్షకులను ఈ సినిమా మెప్పించింది.

2011 సెప్టెంబర్‌ 16న థియేటర్‌లోకి వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆదరించి బ్లాక్ బస్టర్ హిట్‌ను చేశారు. అలాంటి బ్లాక్ బస్టర్ మూవీ ఇప్పుడు మళ్లీ రీ రిలీజ్ కాబోతోంది. అసలే టాలీవుడ్‌లో ఇప్పుడు రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ప్రతీ నెల ఏదో ఒక కల్ట్ క్లాసిక్ మూవీ రీ రిలీజ్ అవుతూనే ఉంది. ఈ రీ రిలీజ్‌లకు థియేటర్లు షేక్ అవుతున్నాయి.

అయితే ఇప్పుడు ఇదే క్రమంలో ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ‘జర్నీ’ని రీ రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. లక్ష్మీ నరసింహా మూవీస్ బ్యానర్ మీద ఏ.సుప్రియ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నారు. ఫిబ్రవరిలో జర్నీని గ్రాండ్‌గా మళ్లీ థియేటర్లోకి తీసుకురాబోతున్నారు. ప్రేమికులకు ఈ సినిమా మంచి ఫీస్ట్‌ లాంటిదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

>
మరిన్ని వార్తలు