ఎన్టీఆర్‌ 30: అప్పుడే రిలీజ్‌ కూడా ఫిక్స్‌

12 Apr, 2021 20:14 IST|Sakshi

2016లో వచ్చిన 'జనతా గ్యారేజ్‌' ఎంత హిట్టు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రకృతి ప్రేమికుడిగా కనిపించిన ఈ సినిమాను కొరటాల శివ డైరెక్ట్‌ చేశాడు. సరిగ్గా ఐదేళ్ల గ్యాప్‌ తర్వాత వీరిద్దరూ మరోసారి కలిసి పని చేయనున్నారు. ఈ విషయాన్ని కొరటాల శివ సోమవారం అధికారికంగా ప్రకటించాడు. కాగా ఇది తారక్‌కు 30వ సినిమా. ఇక ఈ చిత్రం షూటింగ్‌ అయినా మొదలు పెట్టకముందే రిలీజ్‌ డేట్‌ కూడా ప్రకటించి ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేశాడు దర్శకుడు.

వచ్చే ఏడాది ఏప్రిల్‌ 29న తారక్‌ సినిమాను థియేటర్లలో వదులుతామని వెల్లడించాడు. 'ఇంతకుముందు లోకల్‌ రిపేరింగ్స్‌ మాత్రమే చేశాం.. కానీ ఈసారి దాని సరిహద్దులు చెరిపేస్తాం..' అని చెప్పుకొచ్చాడు శివ. దీనిపై తారక్‌ స్పందిస్తూ.. మరోసారి కొరటాలతో కలిసి పని చేయడం సంతోషంగా ఉందని వెల్లడించాడు. ఈ సినిమాను తారక్‌ సోదరుడు నందమూరి కల్యాణ్‌రామ్‌ సమర్పిస్తున్నాడు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్, ‘ఆచార్య’ తరువాత కొరటాల కలసి ఈ కొత్త సినిమా చేస్తారట. తాజా అనౌన్స్‌మెంట్‌తో తారక్‌.. త్రివిక్రమ్‌తో, కొరటాల శివ.. అల్లు అర్జున్‌తో సినిమాను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

చదవండి: త్రివిక్రమ్‌తో తారక్‌ సినిమా వాయిదా

మరిన్ని వార్తలు