ఆ దర్శకుడికి నేను పెద్ద ఫ్యాన్‌: జూనియర్‌ ఎ‌న్టీఆర్‌

25 Feb, 2021 17:04 IST|Sakshi

చెక్‌ సినిమాకు జూనియర్‌ ఎన్టీఆర్‌ బెస్ట్‌ విషెస్‌

చంద్రశేఖర్‌ యేలేటికి ఫ్యాన్‌ అంటూ ట్వీట్‌

సినిమా హిట్టు కాలేదంటే కథ బాగోలేదని దర్శకుడిని నిందించలేం. ఎందుకంటే ఫ్లాప్‌ అయిందన్నా, యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుందన్నా దానికి బోలెడు కారణాలు ఉంటాయి. వైవిధ్య సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా పేరు తెచ్చుకున్న చంద్రశేఖర్‌ యేలేటి సినిమాలు కొన్ని పెద్దగా హిట్టవ్వలేదు. దీంతో కొంత నిరుత్సాహపడ్డ ఆయన ఐదేళ్ల విరామం తర్వాత చెక్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నితిన్‌ హీరోగా, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని హామీ ఇస్తున్నాడు. ఈ సినిమా రేపు(ఫిబ్రవరి 26న) విడుదల కానుంది.

ఈ సందర్భంగా చెక్‌ యూనిట్‌కు ఆల్‌ద బెస్ట్‌ చెప్పాడు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌. వినూత్నమైన కథలతో అలరించే చంద్రశేఖర్‌ యేలేటికి తనెప్పుడూ అభిమానినే అంటూ ట్వీట్‌ చేశాడు. చెక్‌ చాలా ఆసక్తికరంగా ఉందని సినిమాపై ప్రశంసలు కురిపించాడు. కాగా చంద్రశేఖర్‌ చెప్పిన 15 నిమిషాల కథ విని ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నా అని నితిన్‌ ఆ మధ్య స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ చేసిన సినిమాలు వేరు.. ‘చెక్‌’ వేరని, ఇందులో తన నటన వినూత్నంగా ఉంటుందని పేర్కొన్నాడు. ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమాకు కల్యాణీ మాలిక్‌ సంగీతం అందించాడు.

చదవండి: 15 నిమిషాల కథ విని ఒప్పుకున్నా: నితిన్‌

కాలంతో పాటు వెళ్లడమే మంచిది: చంద్రశేఖర్‌ యేలేటి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు