దుబాయ్ నుంచి తిరిగొచ్చిన జూ.ఎన్టీఆర్‌

18 Nov, 2020 20:21 IST|Sakshi

సెల‌బ్రిటీల‌కు స‌మ‌యం దొరికితే చాలు విహార‌యాత్ర‌కు చెక్కేస్తుంటారు. కానీ లాక్‌డౌన్‌లో మాత్రం బ‌య‌ట అడుగు కూడా పెట్ట‌కుండా ఇంట్లోనే కుటుంబ స‌భ్యుల‌తో జాలీగా గడిపేశారు. ఇప్పుడు లాక్‌డౌన్ ఎత్తేయ‌డంతో షూటింగ్స్ ప్రారంభ‌మ‌య్యాయి. మ‌రికొంద‌రేమో షూటింగ్స్ ప్రారంభించ‌డానికి ముందు వెకేష‌న్‌కు వెళ్లేందుకు ప్లానులు వేసుకుంటున్నారు. అలా ఎంతోమంది న‌టీన‌టులు ఇత‌ర‌ ప్ర‌దేశాలు చుట్టొస్తున్నారు. ఈ క్ర‌మంలో తెలుగు హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా 'ఆర్ఆర్ఆర్'‌(రౌద్రం ర‌ణం రుధిరం) సినిమా నుంచి చిన్న బ్రేక్ తీసుకున్నారు. కుటుంబంతో క‌లిసి దుబాయ్‌కు వెకేష‌న్‌కు వెళ్లారు. అక్క‌డ‌ ఫ్యామిలీతో స‌ర‌దాగా గ‌డిపిన‌ ఎన్టీఆర్ వారం రోజుల త‌ర్వాత‌ నేడు తిరిగి హైద‌రాబాద్‌కు వ‌చ్చారు. (చ‌ద‌వండి: తాను చెప్పలేక.. ఆమె తెలుసుకోలేక)

ఈ క్ర‌మంలో విమానాశ్ర‌యంలో కొడుకు అభ‌య్ రామ్ చేయి ప‌ట్టుకుని న‌డుస్తున్న హీరో ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఎన్టీఆర్ వెంట ఆయ‌న స‌తీమ‌ణి ల‌క్ష్మి ప్ర‌ణ‌తి కూడా ఉన్నారు. మెరూన్ టీ ష‌ర్ట్‌టో మ‌రింత ఫిట్‌గా క‌నిపిస్తున్న ఎన్టీఆర్ క‌ళ్ల‌జోడు, గ‌డ్డంతో స్టైలిష్‌గా క‌నిపిస్తున్నారు. కాగా సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌బాబు సైతం దీపావ‌ళికి ఫ్యామిలీతో క‌లిసి దుబాయ్‌కు ట్రిప్పేసిన సంగ‌తి తెలిసిందే. ఇక ఆర్ఆర్ఆర్ విష‌యానికొస్తే ఇందులో ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌లు క‌థానాయ‌కులుగా న‌టిస్తుండ‌గా అలియా భ‌ట్‌, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అజ‌య్ దేవ్‌గ‌ణ్‌, శ్రియ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు ఈ సినిమాను డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇదివ‌ర‌కే రిలీజైన పోస్ట‌ర్లు, టీజ‌ర్లు ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేశాయి. (చ‌ద‌వండి: ఆర్‌ఆర్‌ఆర్ నుంచి దీపావళి సర్‌ప్రైజ్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు