అలాంటి అరుదైన స్నేహితుడు కొరటాల : ఎన్టీఆర్‌

15 Jun, 2021 13:41 IST|Sakshi

కొరటాల శివ.. డైరెక్టర్‌గా తొలి చిత్రం మిర్చితో సూపర్‌ సక్సెస్‌ అందుకున్నాడు. తొలుత భద్ర, సింహా, మున్నా సహా పలు సినిమాలకు రచయితగా పనిచేసిన కొరటాల ఆ తర్వాత దర్శకుడిగా మారి విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఓ సందేశంతో పాటు ఆలోచనాత్మక చిత్రాలు తీయడంతో కొరటాలకు ప్రత్యేక స్టైల్‌ ఉంది. మంగళవారం కొరటాల బర్త్‌డే సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్ల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే కొరటాలకు విషెస్‌ తెలియజేస్తే ఎన్టీఆర్‌ చేసిన ట్వీట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

'స్నేహానికి విలువ ఇచ్చే వ్యక్తిత్వం అరుదు. అటువంటి అరుదైన స్నేహితుడు, సన్నిహితుడు అయిన కొరటాల శివ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు' అంటూ ఎంతో  ఎన్టీఆర్‌ విషెస్‌ అందించారు. ఇక ఎన్టీఆర్‌- కొరటాల కాంబినేషన్‌లో జనతా గ్యారేజ్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్‌ రిపీట్‌ కానుంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ పూర్తవగానే కొరటాలతో తారక్‌ సినిమా చేయనున్నారు. 

చదవండి : NTR30: ఫార్మల్ డ్రస్, స్మార్ట్‌ లుక్‌.. ఎన్టీఆర్‌ ఫోటో వైరల్‌
లాక్‌డౌన్‌ టైంలోనూ రెండు చేతులా సంపాదిస్తున్న సుమ.. ఎలాగంటే..

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు