ఎన్టీఆర్‌ లంబోర్ఘిని ఊరుస్‌ కారు, దేశంలో తొలి వ్యక్తిగా తారక్‌

18 Aug, 2021 20:12 IST|Sakshi

సినీ సెలబ్రెటీలకు ఖరీదైన కార్లు అంటే మక్కువ ఎక్కువ. మార్కేట్లోకి కొత్తరకం మోడల్‌ కార్లు వస్తే చాలు వాటిని తమ సొంత చేసుకుంటారు. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రెటీలు బీఎండబ్ల్యూ, రేంజ్‌రోవర్‌, మెర్సిడేస్‌, ఆడి వంటీ కార్లను తమ గ్యారేజ్‌లో చేర్చుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఖరీదైన లగ్జరీ కారు కొనుగోలు చేసి దేశంలోనే తొలి వ్యక్తిగా నిలిచాడు. కాగా ఇటీవల తారక్‌ అంత్యంత ఖరీదైన లంబోర్ఘిని ఉరుస్ కారును ఖరీదు చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇండియాలో లాంచ్‌ అయిన తొలి రోజే ఈ కారును ఎన్టీఆర్‌ బుక్‌ చేసుకున్నాడు. 3.16 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన లంబోర్ఘినీ ఊరుస్‌ బుధవారం ఇటలీ నుంచి శంషాబాద్‌ ఎయిరపోర్టుకు ఆ తర్వాత తారక్‌ ఇంటికి చేరుకుంది. ప్రస్తుతం దీని ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటలీకి చెందిన వోక్స్‌ వాగన్‌ కంపెనీ అనుబంధ సంస్థయే ‘లంబోర్ఘిని’. ప్రపంచ వ్యాప్తంగా గతేడాది ఈ కార్లను ఉత్పత్తి చేయగా.. ఇండియాలో సోమవారం రోజున దీనిని అధికారింగా లాంచ్‌ అయ్యింది. 
(చదవండి: ‘రాజ రాజ చోర’ మూవీ రివ్యూ)

ఈ కారు ప్రత్యేకత ఏంటంటే.. 
3,16 కోట్ల రూపాయల విలువ చేసే ఈ కారు ఫుల్ ఆటోమేటేడ్‌ అట. ఇక బుల్లెట్ ఫ్రూవ్ అని కూడా చెబుతున్నారు. 200 కిమీ వేగంతో వెళుతున్నప్పటికీ ఎలాంటి కుదుపులు ఉండవట. పైగా 2 నిమిషాల్లో 200 స్పీడుకు వెళ్లి.. మళ్లీ 1 నిమిషంలో 10 కి.మీ తగ్గించినా ఎలాంటి ఒడిదుడుకులు లోను కాదట. అంతేకాదు ఇందులో ఆటో సెన్సర్ మిషన్స్ కూడా ఉండటంతో ఎదురుగా వాహనాలు ఉంటే అలర్ట్ చేస్తుందట. ఆటోమేటేడ్‌ కారు తాళాలు ఈ కారు ప్రత్యేకత. ఎలాంటి ప్రమాదం జరిగిన కారు అద్దాలు, కానీ డోర్‌లు కానీ అంత ఈజీ తెరచుకోవట. ఫుల్లీ ఆటోమెటెడ్‌, సెఫ్టీతో లంబోర్ఘినిని తయారు చేశారు.  దీంతో ఎన్టీఆర్‌ లంబోర్ఘీన ఊరుస్‌ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇప్పటికే ఎన్టీఆర్‌ గ్యారేజ్‌ 20పైగా కార్లు ఉన్నాయట. 

మరిన్ని వార్తలు