Jr Ntr : జూ. ఎన్టీఆర్‌ ఫస్ట్‌ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

20 May, 2023 08:52 IST|Sakshi

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌.. ఇది ఒక పేరు కాదు, బ్రాండ్‌. నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక స్టార్‌డమ్‌ని సొంతం చేసుకున్న తారక్‌ ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర' సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. 13ఏళ్లకి ‘బాల రామాయణం'లో బాల రాముడిగా పౌరాణిక పాత్రలో అద్భుతంగా నటించి తొలిసారి నంది అవార్డును సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత 2001లో ఉషాకిరణ్ మూవీస్ వారి ‘నిన్నుచూడాలని’ చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు.

ఈ సినిమా నిరాశ పరిచినా నటుడిగా ఎన్టీఆర్‌కు మాత్రం మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత  ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘స్టూడెంట్ నం.1’ ఎన్టీఆర్ పేరు మార్మోగిపోయింది. ఈ సినిమాతో ఇక ఎన్టీఆర్‌ వెనుతిరిగి చూసుకోలేదు.ఆది, సింహాద్రి, రాఖీ, యమదొంగ, అదుర్స్, బృందావనం సహా మొన్నటి ఆర్‌ఆర్‌ఆర్‌ వరకు ఎన్టీఆర్‌ కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌ బస్టర్‌ సినిమాలు ఉన్నాయి.అంతేకాకుండా ఒకానొక సమయంలో వరుస ఫ్లాపులు వెంటాడినా ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఇండస్ట్రీ హిట్స్‌ ఇచ్చి తన పవర్‌ ఏంటో నిరూపించుకున్నాడు. చదవండి: ఆ డైలాగ్స్ వింటే చాలు.. పూనకాలు పుట్టుకొచ్చేస్తాయి!

యాక్టింగ్, డైలాగ్, డాన్స్..ఇలా అన్నింటిలోనూ మేటి అనిపించుకున్నాడు. ఎమోషన్స్ను పలికించడంలో, డైలాగ్స్‌ చెప్పడంలో సీనియర్‌ ఎన్టీఆర్‌ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్టీఆర్‌ కెరీర్‌లో ముఖ్యంగా రాజమౌళితో చేసిన సినిమాలు బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌గా నిలిచాయి. స్డూడెంట్‌ నెం1, సింహాద్రి, యమదొంగ, మొన్నటి ఆర్‌ఆర్‌ఆర్‌ వరకు వీరిద్దరి కాంబినేషన్‌ ఓ సెన్సేషన్‌.

ప్రస్తుతం ఒక్కో సినిమా కోసం సుమారు రూ. 50-60 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్న తారక్‌ అందుకున్న మొదటి రెమ్యునరేషన్‌ మూడున్నర లక్షల రూపాయలట. అంత మొత్తంలో డబ్బు చూసి ఏం చేయాలో తెలియక చాలారోజుల వరకు ఆ డబ్బును లెక్క పెడుతూ కూర్చున్నాడట. ఇప్పుడేమో కోట్లకు పైగా పారితోషికం అందుకుంటూ పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఆన్‌స్క్రీన్‌ అయినా, ఆఫ్‌ స్క్రీన్‌ అయినా తన టాలెంట్‌తో సెపరేటు ఫ్యాన్‌ బేస్‌ని సొంతం చేసుకున్నాడు. నటుడిగా, సింగర్‌గా, డ్యాన్సర్‌గా, యాంకర్‌గా తనకు తానే సాటి అనిపించుకున్న తారక్‌కి మరోసారి హ్యాపీ బర్త్‌డే. చదవండి: NTR30: ఎన్టీఆర్30 ఫస్ట్‌లుక్‌ పోస్టర్.. టైటిల్ అదిరిపోయింది!

మరిన్ని వార్తలు