SS Rajamouli RRR: ఇలాంటి ఘనతలకు మీరే అర్హులు: జూనియర్ ఎన్టీఆర్

3 Oct, 2022 21:15 IST|Sakshi

టాలీవుడ్‌లో సంచలనం ఆర్ఆర్ఆర్ మూవీ. తాజాగా ఈ చిత్రాన్ని అమెరికాలోని లాస్‌ఎంజిల్స్‌లోని ఓ థియేటర్‌లో ప్రత్యేక షో వేశారు. ఈ షోకు చిత్ర దర్శకుడు రాజమౌళి కూడా హాజరయ్యారు. తాజాగా ఈ షో విజయవంతం కావడం పట్ల రాజమౌళి ట్వీటర్ వేదికగా పంచుకున్నారు. తాజాగా యంగ్‌ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దీనిపై స్పందించారు. ఈ ఘనతలన్నింటికీ మీరే అర్హులు జక్కన్న అంటూ పోస్ట్ చేశారు. నిన్న దర్శకధీరునిపై రామ్‌ చరణ్‌ ట్వీట్ చేయగా.. ఇవాళ యంగ్ టైగర్ రాజమౌళిని సోషల్ మీడియా వేదికగా ప్రశంసించారు.

థియేటర్‌లో ఫ్యాన్స్‌ సందడి: నాటు నాటు సాంగ్‌కు ఫారిన్ ఫ్యాన్స్‌ సైతం డ్యాన్స్‌ చేస్తూ థియేటర్లలో సందడి చేశారు. ఈ విషయాన్ని ట్విటర్‌లో పంచుకున్న రాజమౌళి ప్రేక్షకులను ధన్యవాదాలు తెలిపారు. ఆయన ట్వీట్ చేస్తూ 'నా హీరోలు, నా సినిమా, నా పట్ల మీ అభిమానం, ప్రశంసలు చాలా అపారమైనవి. థ్యాంక్స్‌ యూఎస్ఎ' అంటూ పోస్ట్ చేశారు. ఈ సినిమాలో యంగ్‌ టైగర్ ఎన్టీఆర్, రామ్‌ చరణ్ తేజ్ తమ పాత్రలతో అదరగొట్టారు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఆర్ఆర్ఆర్ రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

ఒక్క షో.. రూ.17 లక్షలు:  దాదాపు 932 సీట్లు కెపాసిటీ గల థియేటర్‌లో ఆర్ఆర్ఆర్ షో వేయడంతో సుమారు రూ.17 లక్షలకు పైగా వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. యూఎస్‌లో జరిగే బియాండ్ ఫెస్ట్‌లో భాగంగా ఈ చిత్రాన్ని రీ-రిలీజ్ చేశారు. ఈ ప్రత్యేక షో టికెట్లు కేవలం 20 నిమిషాల్లోనే అమ్ముడయ్యాయి. 

మరిన్ని వార్తలు