Jr NTR Off To Dubai: ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌ వెళ్లిన ఎన్టీఆర్‌..ఎందుకంటే

14 Sep, 2023 13:38 IST|Sakshi

‘దేవర’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న ఎన్టీఆర్‌.. కాస్త బ్రేక్‌ ఇచ్చి ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌ వెళ్లారు.సెప్టెంబర్‌ 15, 16 తేదిల్లో దుబాయ్‌లో జరగనున్న సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌(సైమా)అవార్డుల వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. ఫ్యామిలీతో కలిసి ఎయిర్‌ పోర్ట్‌కు వెళ్తున్న ఎన్టీఆర్‌ ఫోటోలు, వీడియోలు నెట్టింట ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఎన్టీఆర్‌తో పాటు హీరోలు యశ్, రిషబ్‌ శెట్టి, హీరోయిన్లు మృణాల్‌ ఠాకూర్‌, శ్రీలీల కూడా సైమా అవార్ట్స్‌ వేడుకలో పాల్గొననున్నారు.

ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్‌!
ఈ ఏడాది సైమా అవార్డుల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ 11 కేటగిరీల్లో నామినేషన్స్‌ దక్కించుకుంది. ఇప్పటికే అస్కార్‌తో పాటు జాతీయ అవార్డులను దక్కించుకున్న ఈ చిత్రం.. సైమా అవార్డుల్లో సైతం రికార్డు క్రియేట్‌ చేయబోతుంది. ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్‌కు అవార్డు లభించినట్లు సమాచారం. అందుకే ఎన్టీఆర్‌ ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌ వెళ్తున్నాడు.

ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత టాలీవుడ్‌కి చెందిన మరో చిత్రం సీతారామం 10 కేటగిరిల్లో నామినేషన్స్‌ దక్కించుకుంది. కాంతార, కేజీయఫ్‌ చిత్రాలకు సైతం 11 కేటగిరిల్లో నామినేషన్స్‌ దక్కాయి. తెలుగు ఉత్తమ నటుడి కేటగిరిలో ఎన్టీఆర్‌తో పాటు రామ్‌ చరణ్, నిఖిల్‌, సిద్దూ జొన్నలగడ్డ, దుల్కర్‌ సల్మాన్‌, అడివి శేష్‌ పోటీ పడుతున్నారు. అయితే ఎన్టీఆర్‌కే ఉత్తమ నటుడు అవార్డు లభించిందనే వార్త సోషల్‌ మీడియా వైరల్‌ అవుతోంది. 

A post shared by Pinkvilla South (@pinkvillasouth)

చూడగానే అన్నా అని పిలిచా: హిమజ
ఎన్టీఆర్‌ వెళ్తున్న ఫ్లైట్‌లోనే బిగ్‌బాస్‌ బ్యూటీ హిమజ కూడా దుబాయ్‌ వెళ్తున్నారు. ఎన్టీఆర్‌ని చూడగానే దగ్గరకు వెళ్లి సెల్ఫీ దిగారు. ఈ విషయాన్ని హిమజ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలియజేస్తూ.. ‘చూడగానే అన్న అని పిలిచేశా’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌ అవుతోంది. 
 

A post shared by Himaja💫 (@itshimaja)

మరిన్ని వార్తలు