Jr NTR Emotional: నా కళ్ల వెంట వచ్చిన ప్రతి నీటి చుక్కకు వాళ్ళు బాధపడ్డారు: ఎన్టీఆర్‌

16 Sep, 2023 09:18 IST|Sakshi

సైమా అవార్డ్స్‌- 2023 ఉత్తమ హీరోగా జూనియర్‌ ఎన్టీఆర్‌ అవార్డు అందుకున్నారు. RRR చిత్రంలో ఆయన కొమురం భీం పాత్రలో తన ఫ్యాన్స్‌ను ఫిదా చేశారు. అవార్డును అందుకున్న ఎన్టీఆర్‌ స్టేజ్‌పైన​ ఎమోషనల్‌ అయ్యారు.. మరోసారి అభిమానులపై తనకున్న ప్రేమను తారక్‌ తెలియజేశారు.

(ఇదీ చదవండి: సైమా అవార్డ్స్‌- 2023 విజేతలు వీరే.. ఎన్టీఆర్‌, శ్రీలీల, మృణాల్‌ హవా!)

అవార్డు అందుకున్న తర్వాత ఎన్టీఆర్ ఇలా మాట్లాడారు. 'కొమరం భీమ్ పాత్ర కోసం నేను న్యాయం చేస్తానని నన్ను మళ్ళీ మళ్ళీ మళ్లీ నమ్మినందుకు నా జక్కన్నకు థాంక్స్. నా కో స్టార్​, మై బ్రదర్​, మై ఫ్రెండ్​  రామ్ చరణ్​కు నా ప్రత్యేక ధన్యవాదాలు. నా అభిమానులందరికీ ఎంతో రుణపడి ఉన్నాను.. వారందరికీ నా కృతజ్ఞతలు. నా ఒడిదుడుకుల్లో నేను కింద పడ్డప్పుడల్లా నన్ను పట్టుకుని పైకి లేపినందుకు... నా కళ్ల వెంట వచ్చిన ప్రతి నీటి చుక్కకు వాళ్ళు కూడా బాధ పడినందుకు... నేను నవ్వినప్పుడల్లా నాతో పాటు నవ్వినందుకు... నా అభిమాన సోదరులు అందరికీ తలవంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాను.' అని తారక్ ఎంతో​ భావోద్వేగంగా మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో  సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది.

👉: సైమా అవార్డ్స్‌- 2023లో హాట్‌గా తారల సందడి (ఫోటోలు)

'జనతా గ్యారేజ్' లాంటి సూపర్‌హిట్‌ తర్వాత ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్​లో తెరకెక్కుతున్న దేవర చిత్రంపై భారీ అంచనాలను ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ పెట్టుకున్నారు.  ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ వేగంగా జరుపుకుంటోంది. ఇందులో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్​గా నటిస్తోంది. ఇది ఆమెకు తొలి తెలుగు సినిమా. దేవర సినిమా 2024 సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ సినిమా తో ఎన్టీఆర్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

మరిన్ని వార్తలు