ఆలోచింపజేసేలా ఎన్టీఆర్‌ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోమో

1 Aug, 2021 17:48 IST|Sakshi

బుల్లితెరపై యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా ‘ఎవరు మీలో కోటీశ్వరులు(EMK)’అనే ఓ రియాలిటీ షో రాబోతున్న విషయం తెలిసిందే. ఫ్రెండ్‌షిప్‌ డే సందర్భంగా ఆదివారం ఈ షో ప్రోమోని విడుదల చేశారు నిర్వాహకులు. ఈ ప్రోమో ఆద్యంతం ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేసేలా ఉంది. చదువు విలువతో పాటు కరోనా కాలంలో ప్రజల కష్టాలను తెలియజేసేలా ప్రోమోని అద్భుతంగా కట్‌ చేశారు. 

కరోనా కష్ట కాలంలో ఉద్యోగాన్ని కోల్పొయిన  ఓ ప్రైవేట్‌ లెక్చరర్‌ .. ఈ  షో వల్ల రూ.25 లక్షలు గెలుచుకుంటాడు. అయితే ఆ డబ్బులో సగం విద్యార్థుల ఫీజలకు ఉపయోగిస్తానని చెప్తాడు. చివరికి ఎన్టీఆర్‌ ఎంట్రీ ఇచ్చి ‘ఇక్కడ మనీతో పాటు మనసులు కూడా లుచుకోవచ్చు. ఇక్కడ క‌థ మీది, క‌ల మీది.. ఆట నాది.. కోటి మీది.. రండి గెలుద్దాం’అని చెప్పడంతో ప్రోమో ముగుస్తుంది.షెడ్యూల్ ప్రకారం ఈ ప్రోగ్రాం మే చివరివారం నుంచి ప్రసారం కావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ షో వాయిదా పడింది. మొత్తానికి ఈ నెల (ఆగస్టు) లోనే 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో ప్రారంభం కాబోతున్నట్లు ప్రోమో ద్వారా తెలియజేశారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు