కొడుకుతో జూనియర్‌ ఎన్టీఆర్‌ షికారు

18 Apr, 2021 20:19 IST|Sakshi

జూనియర్‌ ఎన్టీఆర్‌... ఎంత ఎత్తు ఎదిగినప్పటికీ ఒదిగే ఉండే హీరో ఇతడు. అభిమానులను ఎంటర్‌టైన్‌ చేసేందుకు భిన్నమైన సినిమాలు చేసే యంగ్‌ టైగర్‌ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్‌ 13న థియేటర్లలో విడుదల కానుంది. అనంతరం దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించే చిత్రంలో తారక్‌ హీరోగా నటించనున్నాడు. ఇది వచ్చే ఏడాది ఏప్రిల్‌ 29న విడుదల కానుంది. ఈ రెండింటి తర్వాత 'కేజీఎఫ్‌' డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌తో సినిమా చేయనున్నట్లు ఇప్పటికే ఊహాగానాలు వెలువడుతున్నాయి.

దీనికి సంబంధించిన అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ ఎన్టీఆర్‌ బర్త్‌డే రోజున అంటే మే 20న రానుంది. ఇదిలా వుంటే తారక్‌ ఆదివారం నాడు తన కొడుకుతో కలిసి ఎంజాయ్‌ చేశాడు. రెండో తనయుడు భార్గవ్‌రామ్‌ను బైక్‌ మీద ఎక్కించుకుని హైదరాబాద్‌ రోడ్ల మీద షికారుకెళ్లాడు. కొడుకు కోరిక మేరకు తారక్‌ అతడిని బైక్‌ మీద ఎక్కించుకుని సంతోషపర్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీని తాలూకూ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

చదవండి: అల్లుడికి ఖరీదైన గిఫ్ట్‌ ఇచ్చిన నాగబాబు.. అదేంటంటే!

పెళ్లికి ముందు అజయ్‌ దేవ్‌గణ్‌ ఓ ప్లే బాయ్‌!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు