బుల్లితెరపై మరోసారి హోస్ట్‌గా ఎన్టీఆర్‌

11 Dec, 2020 18:32 IST|Sakshi

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ వెండితెరపైనే కాదు బుల్లితెర‌పై కూడా ఇప్ప‌టికే తానేంటో నిరూపించుకున్నారు. బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరించాడు.ఎన్టీఆర్ షోకు హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించ‌డంతో మంచి స‌క్సెస్ అయింది. ఆ తర్వాత రెండో, మూడో సీజన్‌కు కూడా తారక్ వచ్చే అవకాశం ఉందని పుకార్లు వచ్చాయి కానీ, అది జరగలేదు. బిగ్ బాస్ లాంటి షో కాకుండా ఏదైనా టాక్ షో చేస్తే బావుంటుందని ఎన్టీఆర్ అనుకున్నారట. 
(చదవండి : ‘బంగారు తల్లి.. ఈ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను’)

ఎన్టీఆర్‌ కోసం ఓ ప్రముఖ టీవీ చానెల్‌ ప్రత్యేకమైన షోను ఏర్పాటు చేసిందట. ఈ టాక్‌ షోకు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడ‌న్న వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.  ఇక టాక్ షోను ఎలా ప్లాన్ చేస్తున్నారో తెలియదు గాని శని ఆదివారాల్లో తారక్ రెండు గంటల సమయాన్ని కేటాయిస్తే చాలాట. అందుకే తారక్ ఈజీగా ఒప్పేసుకున్నాడట. షోను కొనసాగిస్తూనే షూటింగ్స్ కూడా హ్యాపీగా చేసుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు లైన్స్ లో ఈ టాక్ షో సాగుతుంద‌ని స‌మాచారం. ఈ షో కోసం అన్న‌పూర్ణ స్టూడియోస్ లో ప్ర‌త్యేకంగా ఓ సెట్ కూడా వేస్తున్న‌ట్టు టాక్‌. దీనికోసం రెండు ఫ్లోర్ ల‌ను బుక్ చేసుకున్నాడ‌ట మేక‌ర్స్. మ‌రి దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. ఎన్టీఆర్‌ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు