ఆస్కార్ అవార్డు సందడి ముగిసింది. ఈ ఏడాది లాస్ ఎంజిల్స్‌లో వేదికగా జరిగిన 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో మన ఇండియన్ సినిమాలు సత్తా చాటాయి. ఇందులో తన తెలుగు సినిమా ఉండటం విశేషం. రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డులు వరించాయి. ఈ నేపథ్యంలో జక్కన్న, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో పాటు ఆర్‌ఆర్‌ఆర్ టీం అంత ఈ వేడుకలో సందడి చేశారు. ఆవార్డు ప్రదానోత్సవం అనంతరం రాజమౌళి టీం అందరికి అమెరికాలో పార్టీ కూడా ఇచ్చాడు.
ఇక ఆస్కార్ హంగామ ముగియడంతో ఒక్కొక్కరు ఇండియాకు వచ్చేస్తున్నారు. ఇక ముందుగా తారక్ నేడు హైదరాబాద్ చేరుకున్నారు. అమెరికా నుంచి బయలుదేరిన తారక్ బుధవారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. నాటు నాటు ఆస్కార్ అందుకున్న తర్వాత ఎన్టీఆర్ తెలుగు గడ్డ మీద తొలిసారి అడుగుపెడుతుండటంతో అభిమానులంత భారీగా ఎయిర్ పోర్ట్‌కు తరలి వచ్చారు. తారక్ చూసి ఫ్యాన్స్ అంత ఆయనను చూట్టిముట్టి కేకలు వేస్తూ హంగామా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
#NTR back to HYD fans welcomed in style 😎🐯 @tarak9999 #GlobalStarNTR pic.twitter.com/VYQ2m5rFZE
— UK NTR Fans (@UKNTRfans) March 14, 2023
ఎయిర్‌పోర్టులో తారక్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆర్‌ఆర్‌ఆర్ టీంలో తాను సభ్యుడిని అయినందుకు చాలా గర్వంగా ఉంది. నాటు నాటు పాటకు ఆస్కార్ ప్రకటించిన ఆ క్షణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. మన తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా వేదికపై కిరవాణి, సుభాస్ చంద్రబోస్‌లు ఆస్కార్ అవార్డు అందుకోవడం మరింత సంతోషాన్ని ఇచ్చింది. అదో మధురు జ్ఞాపకం. ఆ మూమెంట్‌ని ఎప్పటికి మరిపోను. ఇదంత ప్రేక్షకుల వల్లే ఈ విజయం సాధ్యమైంది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాను అంతగా ఆదరించి ఈ స్థాయికి తీసుకువెళ్లిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ధన్యవాదాలు’ అంటూ తారక్ ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో ఫ్యాన్స్ బాగా ఆకట్టుకుంటోంది. ఫ్యాన్స్ ర్యాలీ మధ్య తారక్ సిటీలోకి ఎంట్రీ ఇచ్చాడు.
#WATCH | Telangana: RRR Actor Jr NTR arrived at the Rajiv Gandhi International Airport in Hyderabad.
'Naatu Naatu' song from RRR won the #Oscar for the Best Original Song pic.twitter.com/f5zGfnyk7m
— ANI (@ANI) March 14, 2023
Seeing MM Keeravaani & Chandrabose accepting the Oscar award was the best moment. I feel very proud of RRR. I want to thank every Indian for encouraging RRR, this award (Oscar) that we've won has only been possible with the love of the audience & the film industry: Actor Jr NTR pic.twitter.com/jTwLQGceTN
— ANI (@ANI) March 14, 2023