స్టూడెంట్‌ లీడర్‌గా జూనియర్‌ ఎన్టీఆర్‌?

4 May, 2021 03:18 IST|Sakshi

‘జనతా గ్యారేజ్‌’ (2016) తర్వాత దర్శకుడు కొరటాల శివ, హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో మరో చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్ర గురించి పలు వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో ఎన్టీఆర్‌ స్టూడెంట్‌ లీడర్‌గా కనిపించనున్నారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పాత్రకు కాస్త పొలిటికల్‌ టచ్‌ కూడా ఇస్తున్నారట కొరటాల. ఈ సినిమా షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుంది.

ప్రస్తుతం కొరటాల ‘ఆచార్య’, ఎన్టీఆర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చేస్తున్నారు. కరోనా ప్రభావం తగ్గి, ఈ ఇద్దరూ చేతిలో ఉన్న సినిమా  పూర్తి చేయాలి. ఆ తర్వాత వీరి కాంబినేషన్‌ సినిమా చిత్రీకరణ ఆరంభమవుతుంది. అయితే విడుదల తేదీని మాత్రం ఫిక్స్‌ చేసేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 29న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు