రాజమౌళితో ఎన్టీఆర్‌ వాలీబాల్‌.. వీడియో వైరల్‌

27 Jul, 2021 16:37 IST|Sakshi

Jr NTR And Rajamouli Playing Volleyball Video: యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌, దర్శకధీరుడు రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నారు. కరోనా ఫస్ట్‌, సెకండ్‌ వేవ్స్‌ కారణంగా షూటింగ్‌కి ఆటంకం కలిగినప్పటికీ.. పరిస్థితులు చక్కబడగానే చిత్రీకరణ మొదలు పెట్టారు. ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌ తుది దశకు చేరింది. ఆగస్ట్‌ 1న తొలి పాటను కూడా విడుదల చేయనున్నారు.

ఇదిలా ఉంటే.. నిత్యం షూటింగ్‌లో బిబీగా ఉంటే.. ఎన్టీఆర్‌, రాజమౌళి కొంత ఖాళీ సమయంలో దొరకడంతో వాలీబాల్‌ ఆడారు. ఈ దృశ్యాన్ని వీడియోలో బంధించిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇందులో ఎన్టీఆర్, రాజమౌళి చాలా ఎనర్జిటిక్‌తో వాలీబాల్‌ ఆడుతున్నారు. ఈ వీడియోను యంగ్ టైగర్ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తుండగా, భారీ ఎత్తున లైకులు, షేర్లు లభిస్తున్నాయి.

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, దర్శకధీరుడు రాజమౌళి మంచి స్నేహితులన్న సంగతి అందరికి తెలిసిందే. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్ మొదలైనప్పటి నుంచి తుది దశ వరకు వారి స్నేహం మరింత బలపడింది. ఇక అప్పుడప్పుడు షూటింగ్ గ్యాప్ లో రాజమౌళి, హీరోలతో కలిసి ఆటలు ఆడుతుంటాడు. అయితే ఎన్టీఆర్‌ ఇప్పటి వరకు ఏ గేమ్‌ ఆడుతూ కనిపించలేదు. తొలిసారి ఆయన వాలీబాల్‌ ఆడుతూ కనిపించడంతో యంగ్‌ టైగర్‌ ఫ్యాన్స్‌తో పాటు మిగతా సినీ ప్రేక్షకులు ఈ వీడియోలను ఆసక్తిగా తిలకిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు