సింహాద్రి విజయంలో ఆయన పాత్ర కీలకం: జూనియర్ ఎ‌న్టీఆర్‌

18 Jan, 2021 12:17 IST|Sakshi

ప్రముఖ నిర్మాత వి.దొరస్వామి నేడు(సోమవారం) ఉదయం తుది శ్వాస విడిచిన సంగతి విదితమే. ఆయన మరణం పట్ల టాలీవుడ్‌ సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన ఇక లేరనే వార్త చాలా బాధాకరమని హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ అన్నారు. నిర్మాతగా, పంపిణీదారుడిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు. సింహాద్రి చిత్ర విజయంలో ఆయన పాత్ర ఎంతో కీలకమని గుర్తు తెచ్చుకున్నాగు. దొరస్వామి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. (చదవండి: ప్రముఖ తెలుగు నిర్మాత‌ కన్నుమూత)

"అజాత శత్రువు, అందరికీ బంధువు దొరస్వామి గారు డిస్ట్రిబ్యూషన్ రంగంలో కింగ్‌లా వెలిగారు. మేం తీసిన 90 శాతం సినిమాలు ఆయనే రిలీజ్‌ చేశారు. ఆయన తీసిన అన్నమయ్య కీర్తనలకు నేను దర్శకుడిగా పని చేసినప్పుడు పంచుకున్న అనుభవాలన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి. ఆయనకు ఆత్మ శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పేర్కొన్నారు. తదితరులు సైతం ఆయన మృతికి నివాళులు అర్పిస్తున్నారు. కాగా ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానంలో రేపు ఉదయం 11 గంటలకు దొరస్వామి అంత్యక్రియలు జరగనున్నాయి. (చదవండి: యాక్షన్‌ సీన్‌ కోసం 50 రోజులు నైట్‌ షూట్‌)

మరిన్ని వార్తలు