ప్రభాస్‌ని చూసి అలెర్ట్‌ అయినా పాన్‌ఇండియా స్టార్స్‌!

22 May, 2022 12:00 IST|Sakshi

పాన్ ఇండియా లెవల్లో స్టార్ డమ్ అందుకోవడం ఒక ఎత్తు. ఆ తర్వాత ఆ స్టార్ డమ్ ను నిలబెట్టుకోవడం మరో ఎత్తు. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా మార్కెట్ లో వరుస ఫ్లాప్స్ ఇచ్చాడు. ఇప్పుడు తప్పులు సరిదిద్దే పనుల్లో పడ్డాడు. అందుకే మిగితా పాన్ ఇండియా హీరోలు అలెర్ట్ అయ్యారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, యశ్ సేఫ్ సైడ్ చూసుకుంటున్నారు. పాన్ ఇండియా హీరోలుగా వెలిగిపోయేందుకు చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేస్తున్నారు.

కేజీయఫ్ సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు కన్నడ నటుడు యశ్.రాఖీభాయ్ క్యారెక్టర్ లో యశ్ కనిపించిన తీరు, అతని నటన, పాన్ ఇండియా ఆడియెన్స్ ను ఉర్రూతలూగించింది. కేజీయఫ్ 2 తో కలిసొచ్చిన ఇండియా వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కాపాడుకునేందుకు మరోసారి రాఖీభాయ్ క్యారెక్టర్ ను రిపీట్ చేస్తున్నాడు. త్వరలోనే కేజీయఫ్ 3తో తిరిగొస్తానంటున్నాడు.

ఆర్ ఆర్ ఆర్ చేస్తున్నప్పుడే ఆ సినిమా రేంజ్ ను ఎక్స్ పెక్ట్ చేసి,అందుకు తగ్గట్లే పాన్ ఇండియా మూవీస్ ను లైనప్ లో పెట్టాడు రామ్ చరణ్.ఇప్పటికే మాస్టర్ డైరెక్టర్ శంకర్ మేకింగ్ లో భారీ యాక్షన్ చిత్రం చేస్తున్నాడు. గౌతమ్ తిన్ననూరితో మూవీ లైనప్ లో ఉంది.ఇప్పుడు వీటితో పాటు తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో మూవీ చేయాలనుకుంటున్నాడు చరణ్.

ఖైదీ,మాస్టర్, విక్రమ్ లాంటి యాక్షన్ మూవీస్ తో  నయా ట్రెండ్ సెట్ చేసాడు లోకేష్.గన్స్ అండ్ బిర్యానీ కాన్సెప్ట్ ను మిక్స్ చేస్తూ వరుసగా బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్నాడు.ఇప్పుడు ఇదే ట్రెండ్ ను రామ్‌ చరణ్‌ కంటిన్యూ చేస్తూ లోకేష్ మేకింగ్ లో తాను కూడా యాక్షన్ హీరోగా కనిపించాలనకుంటున్నాడు

ఆర్ ఆర్ ఆర్ తర్వాత యంగ్ టైగర్ చేయాల్సిన సినిమా ఎప్పుడో ఫిక్స్‌ అయిపోయింది. కొరటాలశివతో  తారక్ పాన్ ఇండియా మూవీ లాక్ అయింది.ఈ తర్వాత ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ సినిమా చేయబోతున్నాడు. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. 

మరిన్ని వార్తలు