‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సెట్‌లో చరణ్‌ అసహనం, వీడియో షేర్‌ చేసిన తారక్‌

9 Aug, 2021 14:14 IST|Sakshi

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ల భారీ మల్టీస్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఇటీవల ఉక్రెయిన్‌లో ల్యాండ్‌ అయిన ఆర్‌ఆర్‌ఆర్‌ టీం అక్కడ షూటింగ్‌ షెడ్యూల్‌ శరవేగంగా జరుపుకుంటోంది. నేటి నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ ఉక్రెయిన్‌లో మూవీ షూటింగ్‌కు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పడు ఆర్‌ఆర్‌ఆర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో పంచుకోనున్నట్లు తారక్‌ తెలిపాడు. ఈ నేపథ్యంలో షూటింగ్‌ సెట్‌లో కాస్తా అసహనంతో ఉన్న చెర్రి వీడియోను ఎన్టీఆర్‌ తాజాగా పంచుకున్నాడు.

చరణ్‌ కుర్చీలో కూర్చోని ఉండగా ఎన్టీఆర్‌ వీడియో తీస్తూ ‘చరణ్‌ డ్రమ్స్‌ ప్రాక్టిస్‌ అయ్యిందా అని అడగ్గా.. హా అయిపోయింది. నిజమైన డ్రమ్స్‌ ఎక్కడ కార్తీకేయ, క్యాస్టూమ్స్‌ లేవు, ఏం లేవు. పొద్దుపొద్దున్నే తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టారు’ అంటూ రాజమౌళి కుమారుడు కార్తీకేయపై చరణ్‌ కాస్తా ఆగ్రహం చూపించాడు. దీంతో కార్తీకేయ నవ్వుతూనే.. వస్తున్నాయి రెండు నిమిషాలు అంటూ సమాధానం ఇచ్చాడు. అలాగే దసరాకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చెర్రి ఈ వీడియోలో చెప్పకనే చెప్పాడు. 

 ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురంభీమ్‌గా తారక్‌ కనిపించనున్నారు. సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో ఇది రూపుదిద్దికుంటోంది. ఆలియాభట్, అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని, ఒలీవియా మోరీస్‌ తదితరులు ఇందులో కీలకపాత్రలు పోషిస్తున్నారు. కిరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీలోని ‘దోస్తీ’ సాంగ్‌, మేకింగ్‌ వీడియో ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. దసరా కానుకగా అక్టోబర్‌ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

A post shared by RRR Movie (@rrrmovie)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు