‘ఒక్క ఫోటో.. నీ కష్టం ఏంటో తెలుపుతోంది’

19 Oct, 2020 13:15 IST|Sakshi

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. దాదాపు ఆరు నెలల విరామం తర్వతా తాజాగా ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం ఎన్టీఆర్‌ షేర్‌ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. మూవీ కోసం ఆయన పడుతున్న కష్టం ఈ ఒక్క ఫోటోతో అర్థమవుతోంది. ఫోటోగ్రాఫర్‌ డాబూ రత్నానితో కలిసి ఎన్టీఆర్‌ దిగిన ఈ ఫోటో ప్రస్తుతం అభిమానులతో పాటు నెటిజనులను తెగ ఆకర్షిస్తుంది. ‘భీమ్‌ పాత్ర కోసం ఎన్టీఆర్‌ ఎంతలా కష్ట పడ్డాడో ఈ షర్ట్‌లెస్‌ ఫోటో తెలియజేస్తుంది. కొమరం భీమ్‌ పాత్రపై అంచనాలను మరింత పెంచుతోంది’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు. ఇక ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్రకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. కానీ కరోనా కారణంగా షూటింగ్‌లు నిలిచిపోవడంతో అది కుదరలేదు. (చదవండి: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మరో పోస్టర్‌.. దేశభక్తి మూవీ కాదు)

అయితే ఆరు నెలల విరామం తర్వాత మళ్లీ ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 22న ఎన్టీఆర్‌ పాత్రకు సంబంధించిన టీజర్‌ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. దీనికి రామ్‌ చరణ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇవ్వనున్నారు. ఎన్టీఆర్‌కి జోడీగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరిస్, రామ్‌ చరణ్‌కి జోడీగా హిందీ నటి ఆలియా భట్‌ కనిపించనున్నారు. శ్రియ, అజయ్‌ దేవగన్, సముద్రఖని ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు