Jr Ntr : 'ఎక్కువ సేపు నిలబడలేను.. గంటకో అప్‌డేట్‌ అంటే కష్టం,అర్థం చేసుకోండి'... 

6 Feb, 2023 10:58 IST|Sakshi

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ కొరాటాల శివ దర్శకత్వంలో సినిమా అనౌన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇంతవరకు ఈ మూవీ షూటింగ్‌ మొదలుపెట్టలేదు. ఎన్టీఆర్‌30 అప్‌డేట్స్‌ కోసం ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా నందమూరి కల్యాణ్‌ రామ్‌ నటించిన 'అమిగోస్‌' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్‌కు ఫ్యాన్స్‌ నుంచి ఇదే ప్రశ్న ఎదురైంది.

దీంతో వేదికపైనే ఎన్టీఆర్‌ 30 అప్‌డేట్స్‌ ఇవ్వాలంటూ యాంకర్‌ సుమ ఎన్టీఆర్‌ను డైరెక్టుగా అడిగేయడంతో ఎన్టీఆర్‌ ఎందుకో గానీ కాస్త సీరియస్‌ అయినట్లు కనిపించారు. 'అభిమానులు అడగకపోయినా మీరు చెప్పించేసేలాగా ఉన్నారే'.. అంటూ సుమకు కౌంటర్ వేశాడు. అనంతరం ఫ్యాన్స్‌కి కూడా స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. "నాకు ఒంట్లో బాగోలేకపోయినా .. మీ అందరినీ చూడాలనే ఉద్దేశంతో వచ్చాను. బాడీ పెయిన్స్ వలన ఎక్కువ సేపు నిలబడలేను కూడా .. ప్లీజ్ అర్థం చేసుకోండి.

అప్‌డేట్‌, అప్‌డేట్‌ అని ఇబ్బంది పెట్టకండి. ప్రతి రోజూ, ప్రతి గంటా అప్‌డేట్స్‌ ఇవ్వాలంటే చాలా కష్టం. అభిమానుల ఉత్సాహం, ఆరాటంతో డైరెక్టర్లు, నిర్మాతలపై ప్రెజర్‌ పెరిగిపోతోంది. దయచేసి ఈ విషయంలో అర్థం చేసుకోండి. ఒకవేళ అప్‌డేట్‌ ఉంటే ఇంట్లో మా భార్య కంటే ముందే మీకు విషయం చెబుతాం'' అంటూ తారక్‌ చేసిన కామెంట్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు