Jr NTR: ఫ్యామిలీతో వెకేషన్‌.. భార్యను కౌగిట్లో బంధించిన యంగ్‌ టైగర్‌

17 Dec, 2022 17:40 IST|Sakshi

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో వరల్డ్‌ వైడ్‌ గుర్తింపు తెచ్చుకున్నాడు జూనియర్‌ ఎన్టీఆర్‌. ఈ సినిమా తర్వాత అతడు డైరెక్టర్‌ కొరటాల శివ ప్రాజెక్టుకు ఓకే చెప్పాడు. కానీ పలుసార్లు ఈ ప్రాజెక్ట్‌ వాయిదా పడుతుండటంతో చిన్న బ్రేక్‌ తీసుకున్నాడు తారక్‌. సినిమా మొదలు కావడానికి ఇంకా సమయం పడుతుండటంతో ఇటీవలే ఫ్యామిలీతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. భార్యాపిల్లలతో కలిసి అమెరికాకు పయనమైన అతడు అక్కడి అందాలను ఆస్వాదిస్తూ కుటుంబంతో కాలక్షేపం చేస్తున్నాడు.

ఈ క్రమంలో తారక్‌.. భార్య లక్ష్మి ప్రణతిని ప్రేమ కౌగిళ్లలో బంధిస్తున్న ఫోటోను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. దీనికి లవ్‌ సింబల్‌ను జోడించాడు. బ్లర్‌గా ఉన్నా బ్యూటిఫుల్‌గా ఉండటంతో ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్లు మిమ్మల్నిలా చూస్తుంటే మా దిష్టే తగిలేలా ఉంది, బుడ్డోడు భార్గవ్‌ ఫోటో తీసినట్లున్నాడు, అందుకే ఇలా బ్లర్‌గా ఉంది, ఒకసారి క్లారిటీ పిక్‌ కూడా షేర్‌ చేస్తే చూసి తరిస్తాం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

A post shared by Jr NTR (@jrntr)

చదవండి: అర్జున్‌ కల్యాణ్‌ వీడియో చూసి షాకైన శ్రీసత్య
సెన్సార్‌ బోర్డు ఏం చేస్తోంది

మరిన్ని వార్తలు