Jr NTR: ఫ్యాన్స్‌కు జూనియర్‌ ఎన్టీఆర్‌ స్వీట్‌ వార్నింగ్‌

20 Dec, 2021 19:43 IST|Sakshi

Jr NTR Request To His Fans: యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోలుగా నటించిన చిత్రం రౌద్రం రణం రుధిరం(ఆర్‌ఆర్‌ఆర్‌). ఈ పాన్‌ ఇండియా చిత్రం సంక్రాంతికి ముందు అంటే జనవరి 7న రిలీజ్‌ అవుతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్ల స్పీడు పెంచింది చిత్రయూనిట్‌. ఆదివారం ముంబైలో సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ జరగ్గా దీనికి పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. 

కొందరు బారికేడ్లు పగలగొట్టుకుంటూ లోనికి చొచ్చుకున్నాడు. అరుపులు, గోలలతో రచ్చరచ్చ చేయడంతో స్టేజీపై ఉన్న సెలబ్రిటీలు కొంత అసహనం వ్యక్తం చేశారు. దీంతో జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులకు సర్దిచెప్పడానికి ప్రయత్నించాడు. అందరూ కిందకు దిగుతారా? లేదా? పద్ధతిగా లేదు.. కిందకు దిగండి అని స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చారు. రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చాం.. అందరూ మన గురించి చాలా బాగా మాట్లాడుకోవాలని, అందరూ పద్ధతిగా కిందకు దిగండి అంటూ అభ్యర్థించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

మరిన్ని వార్తలు