Jr NTR: తారక్‌ ధరించిన టీషర్ట్‌ అంత ఖరీదా?

30 Jul, 2022 16:17 IST|Sakshi

నందమూరి బ్రదర్స్‌ ఒకేచోట చేరితే అభిమానులకే పండగే. నిన్న అలాంటి కన్నుల పండగనే ఆస్వాదించారు ఫ్యాన్స్‌. శుక్రవారంనాడు నందమూరి కల్యాణ్‌ రామ్‌ మూవీ బింబిసార ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది. ఈ కార్యక్రమానికి అతడి సోదరుడు, యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఈ సందర్భంగా తన స్పీచ్‌తో అదరగొట్టాడు. మా తాతగారు (ఎన్టీఆర్‌), మా నాన్నగారు(హరికృష్ణ) మాకు వదిలి వెళ్లిన అభిమానులు మీరు.. జీవితాంతం మీకు రుణపడి ఉంటాం, మీకు నచ్చేవరకు చిత్రాలు చేస్తూనే ఉంటాం. మీరు కాలర్‌ ఎగరేసుకునేలా చేయడమే మా బాధ్యత అంటూ మాట్లాడాడు.

ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌ ఈ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు బ్లాక్‌ టీషర్ట్‌ ధరించి వచ్చాడు. అది తారక్‌కు పర్ఫెక్ట్‌గా సెట్టవడమే కాకుండా అతడిని మరింత హైలెట్‌ చేసింది. దీంతో అసలా షర్ట్‌ ధర ఎంత? అని అనుమానం వచ్చిన నెటిజన్లు నెట్టింట ఆరా తీశారు. ఈ క్రమంలో తారక్‌ ధరించిన బ్లాక్‌ టీషర్ట్‌ ఖరీదు అక్షరాలా రూ.24,000 అని తెలిసింది. ఒక్క టీషర్టే అంత రేటా? అని అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరేమో తారక్‌ రేంజ్‌కు తగ్గట్టుగా మెయింట్‌న్‌ చేస్తున్నాడు, అందులో ఆశ్చర్యపోవాల్సిందేముందని కామెంట్లు చేస్తున్నారు.

చదవండి:  వారి కుక్కలకు కూడా స్పెషల్‌ రూం ఇస్తారు: జయసుధ షాకింగ్‌ కామెంట్స్‌
ఈ సినిమాకు కల్యాణ్‌ రామ్‌ తప్ప న్యాయం చేయగలిగే నటుడు ఇంకొకరు లేడు.. ఉండడు కూడా

మరిన్ని వార్తలు