హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న జూనియర్‌ ఎన్టీఆర్‌ బావమరిది

27 Jun, 2021 15:49 IST|Sakshi

జూనియర్‌ ఎన్టీఆర్‌ బావమరిది నితిన్‌ చంద్ర త్వరలోనే టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వనున్నారట. ప్రముఖ పారిశ్రామిక వేత్త నార్నే శ్రీనివాస రావు కుమారుడు, లక్ష్మీ ప్రణతి సోదరుడు నితిన్‌ని హీరోగా పరిచయం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసిందే. తేజ దర్శకత్వంలో చిత్రం సీక్వెల్‌తో నితిన్‌ను లాంచ్‌ చేయాలని భావించినా కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌ కుదరలేదు. దీంతో మరో ఇంట్రెస్టింగ్‌ సబ్జెక్ట్‌తో తారక్‌ బావమరిది నితిన్‌ను హీరోగా లాంఛ్‌ చేయనున్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే ఆయన యాక్టింగ్‌లో శిక్షణ కూడా తీసుకున్నారట.

గత కొద్ది కాలంగా నితిన్‌ కథలు వింటున్నారని, తాజాగా ఎన్టీఆర్‌ సలహాతో ఓ కథను నితిన్‌ ఓకే చేసినట్లు ఫిల్మ్‌ నగర్‌ టాక్‌. త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నట్లు ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా ఈ సినిమాకు నితిన్‌ తండ్రి నిర్మాతగా వ్యవహించరించనున్నట్లు సమాచారం. ఇక ఎన్టీఆర్‌ కూడా బావమరిది నితిన్‌కు అన్ని రకాలుగా సపోర్ట్‌ చేస్తున్నాడని, అయితే కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకోమని సలహా ఇచ్చినట్లు సమాచారం. బ్యాక్‌గ్రౌండ్‌తో  వచ్చినా సొంతంగా కష్టపడకపోతే ఇండస్ర్టీలో నిలదొక్కుకోవడం కష్టమన్న సంగతి తెలిసిందే. 

చదవండి : 'ఎన్టీఆర్‌- త్రివిక్రమ్‌ మధ్య మనస్పర్థలు'.. అసలు ఏమైందంటే..
ఉదయ్‌ కిరణ్‌ ఆగిపోయిన 10 సినిమాలు ఇవే!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు