'అరే మన క్లాస్‌లో పోరీలు చాలరా నీకు?'.. ఆసక్తిగా మ్యాడ్ ట్రైలర్!

3 Oct, 2023 17:45 IST|Sakshi

సంగీత్‌ శోభన్‌, నార్నె నితిన్‌, రామ్‌ నితిన్‌, శ్రీ గౌరి ప్రియ రెడ్డి, అనంతిక సనీల్‌ కుమార్, గోపికా ఉద్యన్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం మ్యాడ్. ఈ చిత్రాన్ని కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా అక్టోబర్‌ 6న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా మూవీ మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌ ట్విటర్ వేదికగా మ్యాడ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. 

(ఇది చదవండి: గ్లోబల్ స్టార్ హార్స్‌ రైడ్.. మగధీరను గుర్తుకు తెస్తోన్న చెర్రీ!)

ట్రైలర్ రిలీజ్‌ చేసిన ఎన్టీఆర్‌  'మ్యాడ్ ‍వెబ్‌ వచ్చేసింది.. ట్రైలర్‌ చూస్తే మొత్తం నవ్వులే నవ్వులు.. చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. ఈ చిత్రాన్ని ఇంజినీరింగ్‌ కళాశాల నేపథ్యంలో సాగే కథతో రూపొందించారు. ట్రైలర్‌ చూస్తే యూత్‌ ఫుల్ ఎంటర్‌టైనర్‌గానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సినిమా ప్రారంభం నుంచి నవ్వులు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. ఇప్పటికే ‘జాతి రత్నాలు’ చిత్రం కంటే ఒక్కసారైనా తక్కువ నవ్వానని ఎవరైనా చెబితే.. టిక్కెట్‌ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తామని నిర్మాత నాగవంశీ ప్రకటించారు. 

మరిన్ని వార్తలు