Junior NTR On Samantha Health:సమంత ఆరోగ్యంపై జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్

29 Oct, 2022 18:14 IST|Sakshi

సమంత అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు పేర్కొంటూ  చికిత్స తీసుకుంటున్న ఓ ఫోటోను ఇవాళ సోషల్ మీడియాలో షేర్‌ చేసి అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ ప్రకటనతో ఆమె ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రముఖులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా సమంత త్వరగా కోలుకోవాలని పోస్ట్ చేశారు. 

(చదవండి: అరుదైన వ్యాధితో చికిత్స తీసుకుంటున్న సమంత.. ఎమోషనల్‌ పోస్ట్‌)

జూనియర్ ఎన్టీఆర్ ట్విటర్‌లో రాస్తూ..' త్వరగా కోలుకోవాలి.. మీకు ఆ ధైర్యాన్ని పంపుతున్నా' అంటూ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్‌తో కలిసి జనతా గ్యారేజ్‌, రామయ్య వస్తావయ్యా, బృందావనం, రభస లాంటి పలు చిత్రాల్లో సమంత నటించింది. ఇటీవల ఆమె ఆరోగ్యంపై రకరకాల రూమర్స్‌ తెరపైకి వచ్చాయి. తాజాగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో ఫోటోను షేర్‌ చేయడంతో వాటికి తెరపడింది. ఈ వ్యాధి వచ్చిన వారికి కండరాల బలహీనత, ఎక్కువసేపు నిల్చోలేకపోవడం లాంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. సమంత ఆరోగ్యంపై న్యాచురల్ స్టార్ నాని సైతం స్పందించారు. మీరు ఎప్పటిలాగే బలంగా తిరిగి పుంజుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోరు అంటూ ట్వీట్ చేశారు. 

మరిన్ని వార్తలు