‘జస్ట్ ఏ మినిట్’ అంటున్న అభిషేక్‌

8 Mar, 2023 12:02 IST|Sakshi

‘ఏడుచాపల కథ’ ఫేమ్‌​ అభిషేక్ రెడ్డి నటించిన తాజా చిత్రం ‘జస్ట్ ఏ మినిట్‘. క్లీన్ కామెడీ కంటెంట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. రెడ్ స్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో కార్తీక్ ధర్మపురి సహకారంతో ‘పూర్ణస్ యస్వంత్’  ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నాజియా, జబర్దస్త్ ఫణి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

 ‘బులెట్ బండి’ సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ‘ఎస్ కే బాజీ’ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీ కి టైటిల్ మ్యూజిక్ 17 ఏళ్ల రేయాన్ అనే బాలుడు మ్యూజిక్ ఇవ్వటం విశేషం. ఇప్పటికే, విడుదలైన మోషన్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశ లో ఉంది. త్వరలో ఈ సినిమా టీజర్, ట్రైలర్ రీలిజ్ చేస్తామని చిత్ర యూనిట్‌ పేర్కొంది. 

మరిన్ని వార్తలు