Jyothi Rai Web Series Look: ఓటీటీ కోసం 'గుప్పెడంత మనసు' జగతి మేడమ్‪.. ఇక ఆపడం కష్టమే

27 Sep, 2023 09:04 IST|Sakshi

'గుప్పెడంత మనసు' సీరియల్ ఎంత ఫేమస్సో తెలీదు గానీ ఇందులో జగతి మేడమ్‪‌గా చేసే నటి కూడా అంతే ఫేమస్ అని చెప్పొచ్చు. ఈమె ఒరిజినల్ పేరు జ్యోతి రాయ్. రిషికి తల్లిగా.. మహేంద్ర భూషణ్‌కు భార్యగా.. విలక్షణమైన నటనతో అబ్బుర పరుస్తున్న ఈ సీనియర్ బ్యూటీకి ఎవరైనా ఫిదా కావాల్సిందే. అయితే సీరియల్‌లో మేడమ్ పాత్రకి తగ్గట్టుగా కట్టు బొట్టుతో అలరించే జ్యోతిరాయ్ ఇన్ స్ట్రాగ్రామ్‌లో మాత్రం ఫుల్ స్టైలిష్ ఫోటోలతో కుర్రకారును రెచ్చగొడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

(ఇదీ చదవండి: ప్రియమణిపై మరో రూమర్స్‌.. జీర్ణించుకోలేకపోతున్న ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌)

తాజాగా మన జగతి మేడం ఒక వెబ్‌ సీరిస్‌లో ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపింది. రాహుల్ దీపక్ దర్శకత్వం వహిస్తున్న 'ది ప్రెట్టీ గర్ల్' అనే వెబ్‌ సీరిస్‌లో నటిస్తున్నట్లు ఒక హాట్‌ ఫోటోను షేర్‌ చేసింది. సీరియల్‌ కాబట్టి ఇప్పటి వరకు పద్ధతిగా నటించిన ఈ బ్యూటీ.. ఓటీటీ కోసం తెరకెక్కుతున్న ఈ సీరిస్‌లో తన అందాలతో రెచ్చిపోవడం గ్యారెంటీ అని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

ఈ సినిమా కోసమే ఆమె గత కొంతకాలంగా అందాల ఆరబోత చేయడానికి ప్రధాన కారణం అని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో గ్లామరస్ ఫొటోస్ పుణ్యామా అని జ్యోతిరాయ్ తెగ ఫేమస్ అయిపోయింది. దీంతో ఆమె నుంచి ఏ వార్త వచ్చినా వెంటనే వైరల్‌ అవుతుంది. ఇప్పటికే ఆమెకు కన్నడలో మంచి ఫ్యాన్‌ బేస్‌ ఉంది. అక్కడ ఆమె పలు వెబ్‌ సీరిస్‌లలో కూడా నటించింది. 

A post shared by Jyothi Rai (Jayashree Rai) (@jyothiraiofficial)


 

మరిన్ని వార్తలు