సలార్‌: ప్రభాస్‌కు అక్కగా తెరపైకి మరో హీరోయిన్‌ పేరు!

20 May, 2021 14:37 IST|Sakshi

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌ వరుస పాన్‌ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇందులో ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ‘సలార్‌’ ఒకటి. ఈ మూవీని డైరెక్టర్‌ ప్రకటించినప్పటి నుంచి దీనికి సంబంధించి రూమర్స్‌ సోషల్‌ మీడియాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ప్రభాస్‌ సరసన నటించే హీరోయిన్‌ పాత్రపై ఇంతకాలం రకారకాల వార్తలు వినిపించగా.. తాజాగా ప్రభాస్‌కు సోదరి పాత్ర గురించిన రూమర్స్‌ హల్‌చల్‌ చేస్తున్నాయి.

ఇందులో ప్రభాస్‌కు అక్కగా ప్రముఖ నటి రమ్మకృష్ణ నటించనున్నట్లు నిన్నటి వరకు వార్తలు వినిపించాయి. ఈ తరుణంలో తాజాగా అక్క పాత్రకు మరో హీరోయిన్‌ పేరు తెరపైకి వచ్చింది. ఇందులో ప్రభాస్‌ సోదరి పాత్రకు జ్యోతికను అనుకున్నంటున్నట్లుగా ఫిలిం ధూనియాలో టాక్‌. అంతేగాక ఇప్పటికే మూవీ మేకర్స్‌ జ్యోతికను కలిసి కథ వివరించినట్లు కూడా తెలుస్తోంది. అయితే దీనికి జ్యోతిక గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారా లేదా అనే దానిపై క్లారిటి రావాల్సి ఉంది. అంత ఒకే అయితే ఆమెను తెలుగు, తమిళం వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కన్నడ వెర్షన్‌లో మాత్రం నటి ప్రియాంక త్రివేదిని సంప్రదించినట్లు సమాచారం. కాగా, జ్యోతిక  తెలుగులో చిరంజీవితో ‘ఠాగూర్‌’, నాగార్జునతో ‘మాస్‌’ సినిమాలో హీరోయిన్‌గా నటించారు. అలాగే చంద్రముఖిలో తన నటనకు ప్రశంసలు దక్కాయి. 

 కాగా ‘కేజీఎఫ్’ ప్రొడ్యూసర్ విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్న ఈ మూవీలో ప్రభాస్‌ డ్యూయెల్‌ రోల్‌ పోషిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. శృతీ హాసన్‌ ఈ మూవీతో మొదటి సారిగా డార్లింగ్‌తో జతకడుతోంది. భారీ పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీని డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ పక్కా యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక దీనితో పాటు ప్రభాస్‌ మరో రెండు పాన్‌ ఇండియా చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఓంరౌత్‌ దర్శకత్వంలో ‘ఆదిపురుష్‌’ చేస్తుండగా... రాధా కృష్ణ కుమార్‌ డైరెక్షన్‌లో ‘రాధే శ్యామ్‌’ చిత్రంలో నటిస్తున్నాడు.

చదవండి: 
అప్పుడు అమ్మ... ఇప్పుడు అక్క!

మరిన్ని వార్తలు