హీరోగా రాఘవేంద్రుడు

28 Nov, 2020 05:34 IST|Sakshi
చంద్రబోస్, జనార్దన మహర్షి, రాఘవేంద్రరావు, తనికెళ్ల, కీరవాణి

దర్శకులు రాఘవేంద్రరావు తెరకెక్కించిన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్స్‌లో ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లు సాధారణం. ఆయన తదుపరి సినిమాలోనూ ముగ్గురు హీరోయిన్లు ఉంటారని తెలిసింది. అయితే ఇది ఆయన దర్శకుడిగా తెరకెక్కించే సినిమాలో కాదు. హీరోగా చేయబోతున్న సినిమాలో. ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు హీరోగా ఓ సినిమా రూపొందనుంది. ఆయన కథానాయకుడిగా, నలుగురు హీరోయిన్లతో ఓ సినిమా ప్రస్తుతం ప్లానింగ్‌లో ఉంది. ఈ సినిమాలో ప్రముఖ హీరోయిన్లు రమ్యకృష్ణ, శ్రియ, సమంత, ఓ కొత్త హీరోయిన్‌ నటించనున్నారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ఈ సినిమాలో రాఘవేంద్రరావు భార్యగా  రమ్యకృష్ణ కనిపిస్తారట. ఈ చిత్రానికి తనికెళ్ల భరణి దర్శకుడు. జనార్దన∙మహర్షి కథారచయిత, చంద్రబోస్‌  పాటల రచయిత, కీరవాణి  సంగీత దర్శకుడు.
 

మరిన్ని వార్తలు