జీవితంలో విజయాలతో పాటు పతనాలను చూశా: ప్రముఖ నటుడు

1 Jul, 2021 17:03 IST|Sakshi

న్యూఢిల్లీ: జీవితంలో అనుకోని విజయాలు, అంతలోనే పతనాలు ఇలా ఎన్నో చూశానంటున్నాడు బాలీవుడ్‌ ప్రముఖ నటుడు కబీర్ బేడి. ఇటీవల ఆయన రాసిన పుస్తకం ‘స్టోరీస్ ఐ మస్ట్ టెల్: ది ఎమోషనల్ లైఫ్ ఆఫ్ యాన్ యాక్టర్‌’ కు మంచి గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా ఆయన తన మనవరాలు ఆలయతో లైవ్‌ వీడియో చాట్‌లో ముచ్చటించారు. 

కబీర్‌ రాసిన పుస్తకం మార్కెట్లో అత్యధిక కాపీలు అమ్ముడై బెస్ట్‌ సెల్లర్‌గా నిలిచింది. ఈ ఆనందాన్ని పంచుకోవడానికి ఆయన తన మనవరాలు అలయతో చాలా సేపు సంభాషించారు. అందులో కబీర్‌.. తన జీవితంలో చవిచూసిన ఎత్తు పల్లాలు, వివిధ సంబంధాలు, వివాహం, విడాకులు, మానసిక ఆరోగ్యం లాంటి అంశాలను పంచుకున్నారు.  కబీర్ రాసిన పుస్తకం తన స్నేహితులు చదివారని, వారికి ఎంతగానో నచ్చిందని ఆలయ తెలిపింది. 

ఒకానొక సమయంలో దివాలా తీయాల్సి వచ్చింది


నా జీవితంలో ఊహించని విజయాలు, అనుకోని పతనాలను చూడాల్సి వచ్చింది. ఒకానొక సమయంలో దివాలా తీయాల్సి వచ్చింది. కాని అంతలా జీవితంలో కిందకు పడ్డా వాటి నుంచి  లేచాను.  లైఫ్‌లో ఫెయిల్యూర్‌ కావడం సహజమే, కాని ఎదగాలన్న ఆశ వదులుకోవద్దు. నా వైఫల్యాల నుంచి గుణపాఠాలను నేర్చుకున్నాను అలాగే ఇతరులు కూడా చేస్తారని ఆశిస్తున్నానని ఆయన అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. కబీర పుస్తకానికి స్పందన రోజు రోజు పెరుగుతుండడంతో ఆయన తన పుస్తకాన్ని ఇటలీలో అతిపెద్ద ప్రచురణకర్త అయిన మొండడోరితో సెప్టెంబర్‌లో ఇటలీలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.  

A post shared by ALAYA F (@alayaf)

చదవండి: తాప్సీపై కంగనా ఫైర్‌.. తన పేరు వాడొద్దంటూ చురకలు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు