నాన్నగారు కోలుకుంటున్నారు, వదంతులు నమ్మవద్దు: కైకాల సత్యనారాయణ కుమార్తె

23 Nov, 2021 22:43 IST|Sakshi

ప్రముఖ నటులు కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే సత్యనారాయణ ఆరోగ్యం గురించి సోషల్‌మీడియాలో వదంతులు ప్రచారమయ్యాయి. దీంతో ఆయన కుమార్తె కైకాల రమాదేవి ఈ విషయంపై మంగళవారం ఓ ఆడియో సందేశం విడుదల చేశారు. ‘‘సత్యనారాయణగారి పరిస్థితి బాగానే ఉంది. నాన్నగారు కోలుకుంటున్నారు. బాగానే స్పందిస్తున్నారు. అందరితో మాట్లాడుతున్నారు. నిన్న (సోమవారం) డాక్టర్‌ మాదాల రవిగారు కూడా వచ్చారు. ఆయనతో నాన్నగారు మాట్లాడి థంబ్స్‌ అప్‌ కూడా చూపించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తప్పుడు సమాచారం ఇచ్చి ఎవర్నీ ఆందోళనకి గురిచేయొద్దు’’ అన్నారు రమాదేవి.

మరిన్ని వార్తలు