ప్రేమ, నవ్వులు మరెన్నో ఆనంద క్షణాలు

30 Nov, 2020 16:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టాలీవుడ్‌ బ్యూటీ క్వీన్‌ కాజల్‌ అగర్వాల్‌ వివాహం జరిగి నేటికి నెల. ప్రస్తుతం హనీమూన్‌లో ఉన్న ఈ కొత్త జంట ఆదివారం రాత్రి  వన్‌మంత్‌ యానివర్సిరీని జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కాజల్‌ సోమవారం తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఈ వేడుకలో భర్త గౌతమ్‌తో కలిసి నవ్వూతూ, సరదాగా ఉన్న ఫొటోలను కాజల్‌ అభిమానులతో పంచుకున్నారు.

ఓ పోస్టులో గౌతమ్‌, కాజల్‌ను వీపుపై ఎత్తుకుని ఉన్న ఫొటోకు ‘ప్రేమ, నవ్వులు మరెన్నో ఆనంద క్షణాలు @kitchlug’ అనే క్యాప్షన్‌ను జోడించారు. మరొక పోస్ట్‌లో కాజల్‌ -గౌతమ్‌లు ఒకరిని ఒకరూ చూసుకుంటూ షాంపైన్‌ గ్లాసులు పట్టుకుని ఉన్నారు. దీనికి ‘హస్బెండ్‌’ అంటూ హార్ట్‌ ఎమోజీని జత చేశారు కాజల్‌. గత నెల అక్టోబర్‌ 30 కాజల్‌-గౌతమ్‌లు ముంబైలోని తాజ్‌ మహాల్‌ ప్యాలెస్‌ హోటల్‌లో‌ అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. (చదవండి: సముద్రంలో కాజల్‌ దంపతుల అడ్వెంచర్స్‌..)

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial)

మూడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట పెద్ద సమక్షంలో వివాహా బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి అనంతరం వీరిద్దరూ హానీమూన్‌కు మాల్దీవులు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ ఐలాండ్‌ అందాలను ఆస్వాధిస్తున్న ఫొటోలను కాజల్‌ ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూనే ఉన్నారు. మొదట స్నేహితులుగా పరిచమైన వీరిద్దరూ ఆ తర్వాత మూడేళ్లు ప్రేమించుకున్నట్లు ఇటీవల కాజల్‌ ఓ ఇంటర్య్వూలో తెలిపారు. కాగా ప్రస్తుతం కాజల్‌ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ‘ఆచార్య’ చిత్రంలో మెగాస్టార్‌ చిరంజీవి సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాలో హైదరాబాద్‌లో షూటింగ్‌ జరపుకుంటోంది. ఇప్పటికే చిరంజీవి షూటింగ్‌ పాల్గొంటుండగా.. డిసెంబర్‌ నుంచి కాజల్‌ ‘ఆచార్య’ సెట్స్‌లో అడుగుపెట్టనున్నారు. (చదవండి: అప్పుడు తనయుడికి.. ఇప్పుడు తండ్రికి..)

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా