పెళ్లి తర్వాత కూడా తగ్గదేలే.. ఈ చిన్నారిని గుర్తుపట్టారా?

14 Mar, 2023 21:50 IST|Sakshi

దక్షిణాది సినిమాల్లో అగ్ర కథానాయికల్లో ఒకరిగా పేరు సంపాదించింది. ఉత్తరాదికి చెందిన ఈ బ్యూటీ దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు, తమిళం భాషల్లో స్టార్‌ హీరోలందరితో జతకట్టింది. కాగా కథానాయకిగా మంచి ఫామ్‌లో ఉండగానే ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు తల్లి కూడా అయింది. 2020లో పెళ్లి చేసుకున్న ఆమె గతేడాదిలోనే మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టింది. అయితే ఇదంతా రెండేళ్ల లోపే జరిగిపోయింది. తాజాగా ఆమెకు సంబంధించిన చిన్నప్పటి ఫోటోలు నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి. ఆ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ప్రస్తుతం తమిళ స్టార్ హీరో సినిమాలో నటిస్తోంది. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా? అయితే ఈ స్టోరీ చదివేయండి. 

సాధారణంగా వివాహం అయిన తర్వాత హీరోయిన్‌గా కొనసాగటం కాస్త కష్టమే. కానీ కాజల్‌ అగర్వాల్‌ దాన్ని బ్రేక్‌ చేశారు. పెళ్లే కాదు బిడ్డకు తల్లి అయిన తర్వాత కూడా ఈ బ్యూటీ హీరోయిన్‌గా మెప్పిస్తున్నారు. గతంలో పెళ్లి అయిన తర్వాత కూడా గ్లామర్‌గా నటిస్తారా..? అన్న ప్రశ్నకు కాజల్‌ అగర్వాల్‌ బదులిస్తూ వైనాట్‌ అని ఠక్కున చెప్పుకొచ్చారు. ఈ విషయంలో తాను, తన భర్త చాలా క్లియర్‌గా ఉన్నామని పేర్కొన్నారు.  పెళ్లి, చేసే వృత్తి వేరు వేరు అన్నారు. అయితే గ్లామర్‌ సన్నివేశాలు చిత్ర కథకు ఎంతవరకు అవసరం అన్నది కూడా ముఖ్యమన్నారు. వివాహానంతరం తాను నటించనని ప్రచారం చేశారని..  దాన్ని బ్రేక్‌ చేశానని కాజల్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. 

కాగా.. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ కమల్ హాసన్ ఇండియన్‌- 2 చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి తెలుగులో బాలకృష్ణ సరసన నటించే లక్కీ చాన్స్‌ కాజల్‌ను వరించింది. కాగా కోలీవుడ్లో నటుడు అజిత్‌కు జంటగా నటించే అవకాశం కూడా ఈమె తలుపు తట్టిందనేది తాజా సమాచారం. అజిత్‌ 62వ చిత్రంలో కాజల్‌ను హీరోయిన్‌గా పరిశీలిస్తున్నట్లు తెలిసింది.  
 

మరిన్ని వార్తలు