బేరాలు వద్దు: కాజల్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

19 Apr, 2021 20:58 IST|Sakshi

కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ వేగంగా విరుచుకుపడుతోంది. చిన్నా, పెద్దా, ధనిక,పేద తేడాలు లేకుండా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు కరోనా గుప్పిట్లో చిక్కుకుంటున్నారు. మొదటి దశతో పోలిస్తే రెండో దశలో సినీ పరిశ్రమపై కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉంది. లాక్‌డౌన్ అనంతరం షూటింగ్‌లకు అనుమతి లభించడంతో స్టార్స్‌ అందరూ తమ పనుల్లో బిజీగా మారిపోయారు. దీంతో ఒక్కొక్కరిగా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌లో కత్రినా కైఫ్‌, ఆలియా భల్‌, రణ్‌బీర్‌ కపూర్‌, అమీర్ ఖాన్, మాధవన్, భూమి ఫడ్నేకర్‌ వంటి వారికి కోవిడ్‌ సోకింది. ఇక టాలీవుడ్‌లోనూ కరోనా పంజా గట్టిగానే తగిలింది.

తెలుగు ఇండస్ట్రీలో పవన్‌కల్యాణ్, దిల్ రాజు, బండ్ల గణేశ్, సోనూసూద్, హీరోయిన్ నివేదా థామస్‌లకు కరోనా సోకింది. ఈ నేపథ్యంలో అందరూ ‍కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. తాజాగా కరోనాను ఉద్ధేశించి స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ తన అభిమానులకు ఓ సూచన అందించారు. ప్రస్తుతం కరోనా అత్యంత వేగంగా వ్యాపిస్తోందని.. కరోనాతో బేరాలు వద్దని సూచించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టారు.

‘ప్రస్తుతం కరోనా కారణంగా ప్రపంచం భయానకంగా మారింది. మనం ఊహించని రీతిలో మన ఆరోగ్యానికి, సహనానికి ఈ మహమ్మారి పరీక్ష పెడుతోంది. ఈ ప్రపంచం ప్రమాదకరమైన ప్రదేశంగా మారింది. ఈ పరిస్థితుల్లో మనకోసం ఎంతో శ్రమించే మన ఆరోగ్య వ్యవస్థను కాపాడుకోవడానికి ఇంట్లోనే ఉందాం. జాగ్రత్తగా ఉందాం. మీరు ఎప్పుడైనా త్యాగం చేశారా? ఒక అమ్మాయిని వేరే ఇంటికి పంపడం.. కాలేజీకి మన సోదరులను పంపడం.. పెంపుడు జంతువుకు దీర్ఘకాలిక వ్యాధి ఉండటం..వయసు మళ్లిన గ్రాండ్‌పేరెంట్స్‌ని‌.. ఒక స్నేహితుడి మిమ్మల్ని అపార్థం చేసుకోవడం, మీరు ప్రేమించే వ్యక్తి మౌనం వహించడం, ప్రేమానుబంధాలకు మిమ్మల్ని మీరే దూరం చేసుకోవడం.. ఇలాంటివి జరిగితే మీకు నష్టం అంటే ఏంటో తెలుస్తుంది. కరోనా మీరు ఊహించినట్లు మీ ముందుకు రాదు.. దాని రూపం మార్చుకుంటుంది. కాబట్టి విషాదంతో బేరాలు వద్దు. బాధ మనకే.. గ్రహాంతరవాసికి కాదు’ అంటూ పేర్కొన్నారు.

చదవండి: అభిమానికి డబ్బులు పంపిన కాజల్‌

A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial)

మరిన్ని వార్తలు