Kajal Aggarwal: హబ్బీతో హాలిడే ట్రిప్‌, స్టన్నింగ్‌ ఫోటోలు

19 Aug, 2021 12:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ కాజల్ అగర్వాల్ భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి హాలిడే ట్రిప్‌ను ఎంజాయ్‌ చేస్తోంది. ఈ సందర్బంగా స్విమ్మింగ్ పూల్‌లో బ్లాక్‌బికినీలో దర్శనమిచ్చి ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేసింది.  ఈ ఫోటోలను  ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఆనందాన్ని మనమే సృష్టించుకోవాలి...స్విమ్మింగ్‌ పూల్‌లో సేదతీరకుండా హాలీడే ఎలా పూర్తవతుందంటూ  ఫోటోలను పోస్ట్‌ చేసింది. దీంతో అభిమానుల లైక్‌ల సందడి జోరుగా సాగుతోంది.

కాగా వివాహం అయిన తరువాత తొలిసారిగా హర్యాలీ తీజ్‌ వేడుకను జరుపుకుంది. దీనికి సంబంధించి అందమైన ఫోటోలను కూడా సోషల్‌ మీడియాలో షేర్‌  చేసింది.  అంతేకాదు ఆరువావారాలు, రోజులు 16 గంటలు పనిచేసి అలసిపోయానని, భర్తతో కలిసి హాలీడే ట్రిప్‌కు వెళ్లాలని ఉందంటూ  ఇటీవల  వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial)

A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial)

మరిన్ని వార్తలు