అభిమానికి డబ్బులు పంపిన కాజల్‌

4 Apr, 2021 21:00 IST|Sakshi

పెళ్లయ్యాక కూడా ఫుల్‌ స్పీడు మీద సినిమాలు చేస్తోంది కాజల్‌ అగర్వాల్‌. ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవితో 'ఆచార్య'లో ఆడిపాడుతున్న ఈ భామ తాజాగా ఓ యువతికి ఆర్థిక సాయం చేసినట్లు ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాలేజీ ఫీజు కట్టడానికి డబ్బులు లేక బాధపడుతున్న విద్యార్థినిని సకాలంలో ఆదుకుందట ఈ భామ. ఈమేరకు ఆమె గూగుల్‌ పేలో డబ్బులు పంపించిన స్క్రీన్‌షాట్లతో పాటు సదరు విద్యార్థిని ట్వీట్‌ను షేర్‌ చేస్తున్నారు కాజల్‌ ఫ్యాన్స్‌ .

నెట్టింట వైరల్‌ అవుతున్న దాని ప్రకారం.. సుమ అనే విద్యార్థి  హైదరాబాద్‌లో ఎం.ఫార్మసీ‌ చదువుతోంది. ఓవైపు ఉద్యోగం చేసుకుంటూ తన చదువును కొనసాగిస్తోంది. కానీ ఈ మధ్యే ఆమె ఉద్యోగం పోయింది. దీంతో కళాశాల ఫీజు కట్టేందుకు ఆమె తెగ ఇబ్బంది పడుతోంది. రూ. 82 వేల ఫీజు కడితే కానీ పరీక్షలు రాయనివ్వరు. దీంతో తన చదువు మధ్యలోనే ఆగిపోవాల్సిందేనా? అని ఆమె కన్నీరుమున్నీరుగా విలపించింది. తనకు సాయం అందించమంటూ అభిమాన హీరోయిన్‌ కాజల్‌ను కోరింది. దీంతో విద్యార్థిని వివరాలు సేకరించిన కాజల్‌ ఆమెకు లక్ష రూపాయల సహాయం చేసిందట. ఈ మేరకు నెట్టింట స్క్రీన్‌షాట్లు కూడా ప్రత్యక్షమయ్యాయి. కాజల్ తన అభిమానికి‌ చేసిన సాయానికి ఆమెను ఆకాశానికెత్తుతున్నారు ఫ్యాన్స్‌. చందమామ కాజల్‌ మనసు ఎంత చల్లనిదో అంటూ ప్రశంసిస్తున్నారు.

చదవండి: అర్ధరాత్రి 2 గంటలకు తాగి ఉన్నా: అనసూయ

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు