కాబోయే భర్త, ఆడపడుచుతో కాజల్‌

7 Oct, 2020 13:08 IST|Sakshi

ముంబై: హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తానే స్వయంగా మంగళవారం ప్రకటించారు. దీంతో కాజల్‌కు సోషల్‌ మీడియా వేదికగా స్నేహితులు, బంధువులు, సన్నిహితుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం కాజల్‌ కాబోయే భర్త గౌతమ్‌ కిచ్లు సోదరి గౌరి కిచ్లు నాయర్‌ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. కాజల్‌-గౌతమ్‌లతో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘ప్రేమతో మీకు అభినందనలు’ అంటూ ఇన్‌స్టాలో పోస్టు చేశారు. అది చూసిన కాజల్‌ తన కాబోయే ఆడపడుచుకు ‘ధన్యవాదాలు.. మై సిస్టర్‌’ అంటూ సమాధానం ఇచ్చారు. (చదవండి: ‘పెళ్లి కల వచ్చేసిందే కాజల్‌..’)
  

దీనిని కాజల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీగా పెట్టుకోవడంతో వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో కాజల్‌- గౌతమ్‌ల మధ్య గౌరి కూర్చోని ఉన్నారు. తనకు కాబోయే భర్త, ఆడపడుచులతో అలా సరదాగా సందడి చేస్తున్న కాజల్‌ చూసి అభిమానుల ఆనందం వ్యక్తం చేస్తూ తమ స్పందనను తెలుపుతున్నారు. తన పెళ్లి అక్టోబర్‌ 30న జరగనున్నట్లు కాజల్‌ మంగళవారం వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని ప్రకటిస్తూ.. ‘నేను 30 అక్టోబర్‌ 2020 ముంబైలో గౌతమ్‌ కిచ్లూను పెళ్లి చేసుకోబోతున్నాను. ఈ శుభవార్తను మీతో పంచుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మీరంతా మమ్మల్ని హృదయపూర్వకంగా ఆశ్వీర్వాదిస్తారని ఆశిస్తున్నాను’ అంటూ కాజల్‌ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. (చదవండి: పెళ్లి డేటు చెప్పిన కాజల్‌ అగర్వాల్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు