కాజల్‌ పెళ్లి ఫోటోలు వైరల్‌...

30 Oct, 2020 20:52 IST|Sakshi

అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూసిన కాజల్‌ అగర్వాల్  వివాహ వేడుక అంగరంగ వైభవంగా ముగిసింది. ‘చందమామ’ పెళ్లి అయిపోయింది. చిరకాల స్నేహితుడు గౌతమ్‌ కిచ్లుతో కలిసి ఏడడుగులు వేశారు. మూడు ముళ్ల బంధంతో సరికొత్త ప్రయాణానికి నాంది పలికారు. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో కాజల్‌ పెళ్లి ఫోటోలు వైరల్‌గా మారాయి. ముంబైలోని ఓ ఖరీదైన హోటల్‌ని తమ బిగ్‌డేకి వేదికగా ఎన్నుకున్నారు. ఇక కోవిడ్‌ నిబంధనల నేపథ్యంలో అన్ని నియమాలను పాటిస్తూ.. అత్యంత సన్నిహితుల మద్య ‘చందమామ’ మిసెస్‌గా మారిపోయారు. ఇక వివాహ వేడుకకి గౌతమ్‌ కిచ్లు ఆఫ్-వైట్ అండ్‌ సిల్వర్ కలర్‌ షెర్వానీని ఎంచుకోగా, కాజల్ అగర్వాల్ ప్రకాశవంతమైన ఎరుపు రంగు లెహంగాలో తళుక్కుమన్నారు. ఈ జంటను చూసిన వారంతా ‘మేడ్‌ ఫర్‌ ఇచ్‌ అదర్‌’ అంటూ ప్రశంసిస్తున్నారు. ఇక వివాహానికి ముందు ఈ జంట సంగీత్‌, హల్దీ వేడుకలను నిర్వహించారు. నిషా అగర్వాల్, గౌతమ్‌తో పాటు మరి కొందరు స్నేహితులతో కలిసి కాజల్‌ ఈ వేడుకలో ఫుల్‌ ఎంజాయ్‌ చేశారు. వాటికి సంబంధించిన ఫోటోలు కూడా తెగ వైరలయ్యాయి. (చదవండి: వేడుకల వేళ... ఆనందాల హేల)

కొత్త ఇంట్లో.. కొత్త జీవితం..
వివాహం అనంతరం కాజల్‌, గౌతమ్‌ కిచ్లులు కొత్త ఇంట్లోకి వెళ్లనున్నారు. ఇందుకు గాను ఈ జంట ఇప్పటికే ముంబైలో కొత్త ఇంటిని సిద్ధం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను కాజల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడమే కాక ఎనీ సజేషన్స్‌ అంటూ అభిమానులను సలహా కోరిన సంగతి తెలిసిందే. మూడు రోజుల క్రితం గౌతమ్ కిచ్లు తమ కొత్త ఇంటి ఫోటోలను ఇన్‌స్టా‍గ్రామ్‌లో షేర్‌ చేశారు.అతను తమ బెడ్రూం బిఫోర్‌ అండ్‌ ఆఫ్టర్‌’' ఫోటోను షేర్‌ చేశాడు. దీనిలో పెద్ద టీవీ సెట్ కొన్ని అందమైన నైట్‌ లాంప్స్‌ ఉన్నాయి.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు