త్వరలో పెళ్లి పీటలెక్కనున్న కాజల్‌..!

5 Oct, 2020 16:54 IST|Sakshi

టాలీవుడ్‌ టాప్‌ బ్యూటీ కాజల్‌ అగర్వాల్‌ పెళ్లి పీటలు ఎక్కుబోతున్నట్లు వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ముంబైలో స్థిరపడ్డ బడా వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లు అనే వ్యక్తిని వివాహం చేసుకోబోతున్నట్లు సోషల్‌ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. గతకొంత కాలం క్రితం వీరిద్దరి మధ్య ఏర్పడ్డ స్నేహం.. ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇరువురి కుటుంబ పెద్దల అంగీకారం మేరకు నిశ్చితార్థం కూడా జరిగినట్లు బీటౌన్‌ వర్గాల సమాచారం. అయితే గతంలోనూ ఆమె వివాహంపై అనేకమార్లు పుకార్లు రాగా వాటిని కొట్టిపారేశారు. అయితే తాజాగా వస్తున్న వార్తలపై కాజల్‌ స్పందించకపోవడంతో నిజమే కావచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

టాలీవుడ్‌లో నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా నటించిన లక్ష్మీ కళ్యాణం మూవీతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచమైన ఈ ముద్దుగుమ్మ.. తన అందం, అభినయంతతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. రామ్ చరణ్‌, చిరంజీవి, పవన్‌ కళ్యాన్‌, ఎన్టీఆర్‌​, ప్రభాస్‌, అల్లు అర్జున్‌ వంటి స్టార్స్‌తో నటించి అగ్ర స్థానానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో పలు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. మెగాస్టార్‌ చిరంజీవి ఆచార్య, కమల్ హాసన్ ఇండియన్ 2లు భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నాయి. వీటితో పాటు విష్ణు మోసగాళ్లు, జాన్ అబ్రహాంతో ఓ చిత్రంలోనూ ఆమె నటిస్తున్నారు. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ నటించి మెప్పంచారు. కాగా కాజల్‌ చెల్లి ఇషా అగర్వాల్‌  ఏడేళ్ల కిత్రమే వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా