తండ్రీకొడుకులతో నటించిన హీరోయిన్లు వీళ్లే..

4 May, 2021 08:58 IST|Sakshi

టాలీవుడ్‌లో తండ్రీకొడుకులతో నటించిన హీరోయిన్లు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అందులోనూ ఈ జనరేషన్‌లో ఆ ఫీట్‌ అందుకోవడం కష‍్టసాధ్యం. కానీ టాలీవుడ్‌ చందమామ కాజల్‌ అగర్వాల్‌ మాత్రం ఈ ఫీట్‌ను అందుకున్న హీరోయిన్‌గా రికార్డుకెక్కింది. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌తో మగధీర, నాయక్‌, గోవిందుడు అందరివాడేలే సినిమాల్లో జోడీ కట్టిందీ ముద్దుగుమ్మ. ఆ తర్వాత చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన ఖైదీ నంబర్‌ 150లో నటించింది. ఇదే సినిమాలో తండ్రీకొడుకులు చిరు, చరణ్‌తో కలిసి అమ్మడు లెట్స్‌ డూ కుమ్ముడూ.. అంటూ స్టెప్పులేసింది. తాజాగా ఇప్పుడు ఆచార్య సినిమాలో మరోసారి చిరంజీవితో జోడీ కట్టింది. ఇందులో ఆయన తనయుడు చెర్రీ సిద్ధగా ముఖ్యపాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే.

ఇక మరోవైపు అక్కినేని హీరో నాగచైతన్యతో దడ సినిమాలో నటించింది కాజల్‌. తాజాగా చైతూ తండ్రి నాగార్జున సినిమాలో కాజల్‌ హీరోయిన్‌గా ఎంపికైంది. దీంతో అక్కినేని ఫ్యామిలీలోనూ తండ్రీకొడుకులతో కలిసి నటించినట్లైంది. మొత్తానికి ఈ జనరేషన్‌లో అటు చిరంజీవి- రామ్‌ చరణ్‌, నాగార్జున - నాగచైతన్య వంటి తండ్రీకొడుకులతో నటించిన హీరోయిన్‌గా కాజల్‌ రికార్డు కొట్టేసింది. లావణ్య త్రిపాఠి కూడా నాగార్జునతో సోగ్గాడే చిన్నినాయనా సినిమాలో జోడీ కట్టింది. నాగచైతన్యతో యుద్ధం శరణంలో హీరోయిన్‌గా కనిపించింది.

తమన్నా కూడా సైరా నరసింహారెడ్డిలో మెగాస్టార్‌ పక్కన మెరిసిపోగా చెర్రీతో కలిసి రచ్చ సినిమాలో రచ్చ చేసింది. ఇక రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ రారండోయ్‌ వేడుక చూద్దాంలో నాగచైతన్యతో జత కట్టింది. మరోవైపు నాగార్జున హీరోగా నటించిన మన్మథుడు 2లో నాగ్‌ సరసన నటించింది. ఈ జనరేషన్‌లో తండ్రీకొడుకులతో నటించిన నలుగురు హీరోయిన్ల లిస్టులో కాజల్‌ అగర్వాల్‌ మాత్రం టాప్‌ ప్లేస్‌లో ఉంది.

చదవండి: ప్రస్తుతం ఇదే నా అలవాటు, విశ్రాంతిగా ఉంది: కాజల్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు