ఉగాదికి రిలీజవుతున్న కాజల్‌ ఘోస్టీ

20 Mar, 2023 01:21 IST|Sakshi

హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ ఈ ఉగాదికి ప్రేక్షకులకు థ్రిల్‌ని పంచేందుకు సిద్ధమయ్యారు. కళ్యాణ్‌ దర్శకత్వంలో కాజల్‌ అగర్వాల్, రాధికా శరత్‌ కుమార్, యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘ఘోస్టి’. ఈ నెల 17న విడుదలైన ఈ చిత్రాన్ని ‘కోస్టి’ పేరుతో గంగ ఎంటర్‌టైన్ మెంట్స్‌ ఈ నెల 22న తెలుగులో విడుదల చేస్తోంది. ‘‘హారర్‌ కామెడీగా రూపొందిన చిత్రం ‘కోస్టి’.

ఇందులో తండ్రి, కుమార్తె మధ్య అనుబంధంతో పాటు థ్రిల్‌ అంశాలు కూడా ఉన్నాయి. ఆడియన్స్‌ ఉలిక్కిపడే సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఇన్ స్పెక్టర్‌ ఆరతి పాత్రలో కాజల్‌ బాగా నటించారు. గ్యాంగ్‌స్టర్‌ దాస్‌గా దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌ చేశారు. సామ్‌ సీఎస్‌ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఉగాదికి తెలుగు ప్రేక్షకులకు మంచి వినోదం అందించే చిత్రమిది’’ అని యూనిట్‌ పేర్కొంది.

మరిన్ని వార్తలు