తల్లిగా కనిపించేందుకు రెడీ అయిన కాజల్‌

10 Jul, 2021 21:21 IST|Sakshi

టాలీవుడ్‌ చందమామ కాజల్‌ అగర్వాల్‌ పెళ్లి తర్వాత దూకుడు పెంచింది. వ్యక్తిగత జీవితంతో పాటు కెరీర్‌ను కూడా పక్కా ప్లాన్‌ చేసుకుంటూ ముందుకెళ్తుంది ఈ భామ. గతేడాది గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్.. ఆ తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తోంది. ప్రయోగాలు చేసేందుకు కూడా సై అంటుంది. ఇప్పటిదాకా గ్లామర్ పాత్రలే చేసిన కాజల్ రిస్క్‌ తీసుకోడానికి రెడీ అవుతోంది. ఓ తమిళ చిత్రంలో తల్లి పాత్రలో డీ గ్లామరస్‌గా నటించేందుకు కాజల్‌ ఓకే చెప్పిందట.

సినిమా మొత్తం తల్లీకూతుళ్ల సెంటిమెంట్ పైనే నడుస్తుందని టాక్‌ వినిపిస్తోంది. ఈ చిత్రానికి  'రౌడీ బేబీ' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శరవణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటి రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించనుంది.  ప్రస్తుతం కాజల్‌ మెగాస్టార్‌ చిరంజీవి ‘ఆచార్య’, కమల్‌ హాసన్‌ ‘ఇండియన్‌-2’లో నటిస్తుంది. వీటితో పాటు  నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ తెరకెక్కిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

మరిన్ని వార్తలు