హనీమూన్‌ వాయిదా వేసుకున్న కాజల్‌..

31 Oct, 2020 16:15 IST|Sakshi

ప్రేమించిన ప్రియుడిని పెళ్లాడి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు టాలీవుడ్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌. ముంబైలోని ఓ హోటల్‌లో శుక్రవారం వ్యాపారవేత్త‌ గౌతమ్‌ కిచ్లుతో ఏడడుగులు వేశారు. కోవిడ్‌ నేపథ్యంలో అతి కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక గ్రాండ్‌గా జరిగింది. దీంతో సినీ ఇండస్ట్రీ, అభిమానుల నుంచి పెద్ద ఎత్తున ‘చందమామ’కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. గౌతమ్‌తో జీవితాంత సంతోషంగా గడపాలని కోరుకుంటున్నారు. కాగా పెళ్లి అనంతరం కేవలం రెండు వారాలు మాత్రమే బ్రేక్‌ తీసుకొని మళ్లీ సినిమా షూటింగ్‌లో కాజల్‌ పాల్గొననున్నారు. చదవండి: కాజల్‌ పెళ్లి ఫోటోలు వైరల్‌...

ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో ఫిమేల్‌ లీడ్‌లో కాజల్‌ నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌లో కాజల్‌ మరో 15 రోజుల్లో తిరిగి జాయిన్‌ కానున్నారు. ఇదిలా ఉండగా కాజల్‌ హనీమూన్‌ టాపిక్‌ తాజాగా తెర మీదకు వచ్చింది. అయితే ఇప్పట్లో కాజల్‌-గౌతమ్‌ హనీమూన్‌కు వెళ్లలనే ఆసక్తి లేనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఆచార్య షూటింగ్‌గే కారణం అట. ఈ సినిమా ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం హనీమూన్‌ ట్రిప్‌ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. షూటింగ్‌కు ప్యాకప్‌ చెప్పిన తర్వాత డిసెంబర్‌లో హనీమూన్‌కు ప్లాన్‌ చేయనున్నట్లు సమాచారం. మరోవైపు కాజల్‌ ఆచార్య సినిమాతో పాటు కమల్ హాసన్ ’ఇండియన్ 2’, మంచు విష్ణుతో కలిసి ‘మొసగాళ్లు’లో కనిపించనున్నారు. చదవండి: మూడేళ్ల వయస్సులోనే లైంగిక వేధింపులు: నటి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు