మెహందీ వేడుక అయిపోంది.. ఇవాళ హల్ది ఫంక్షన్‌

29 Oct, 2020 10:48 IST|Sakshi

ముంబై: టాలీవుడ్‌ భామా కాజల్‌ అగర్వాల్‌ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఈనెల 30న కాజల్‌ తన ప్రియుడు, బిజినెస్‌మెన్ గౌత‌మ్ కిచ్లుతో ఏడ‌డుగులు వేయనున్న సంగతి తెలిసిందే. వారి వివాహనికి ఇంకా ఒకరోజు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో నిన్న(బుధవారం) మెహందీ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కాజల్‌ గురువారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ ‘ఈ రోజు మెహందీ వేడుక అయిపోయింది.. రేపు హల్ది ఫంక్షన్’ అంటూ పంచుకున్నారు. ఈ ఫొటోలో కాజల్‌ నవ్వూతూ తన మెహేందీ చేతులను చూపిస్తూ ఫోజ్‌ ఇచ్చింది. దీంతో కాజల్‌ సోదరి, నటి నిషా ఆగర్వాల్‌, స్టెలిస్ట్‌ నీరజా కోన, ఈషా అమిన్‌, ఇతర నటీనటులు కాబోయే పెళ్లి కూతురుకు శుభాకాంక్షలు తెలుపుతూ రెడ్‌ హర్ట్‌ ఎమోజీలను జత చేశారు. అయితే ఈ రోజు ముంబైలో హల్ది ఫంక్షన్‌ జరనుంది. (చదవండి: కాబోయే భర్తతో తొలిసారిగా ఫొటో)

🧿 #kajgautkitched 🧿

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

ఇటీవల కాజల్‌ తన పెళ్లి తేదీని ప్రకటిస్తూ.. గౌతమ్‌, తను కొద్ది రోజులుగా ప్రేమించుకున్నట్లు తెలిపింది. మొదట స్నేహితులుగా పరిచమైన వారిద్దరూ ఆ తర్వాత ప్రేమలో పడినట్లు పేర్కొంది. దీంతో వారిద్దరూ పెళ్లి సిద్దమై ఓకే చెప్పుకోవడంతో కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య నిరాడంబరంగా నిశ్చితార్థం చేసుకున్నట్లు చెప్పింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో పెళ్లికి కూడా పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇక తన సినీ ప్రయాణంలో మద్దతుగా నిలిచి ఆదరించిన ప్రతీ ఒక్కరికీ కాజల్‌ సోషల్‌ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపింది. ఇకముందు కూడా తనను ఆదరిస్తారిస్తారని ఆకాంక్షిస్తున్నానని కాజల్‌ పేర్కొంది. (చదవండి: కాజ‌ల్ ప్రేమ క‌థ త‌నే చెప్తుంది: నిషా)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు