హనీమూన్‌‌ ఫొటోలు షేర్‌ చేసిన కాజల్‌

11 Nov, 2020 20:24 IST|Sakshi

గత జూన్‌లో నిరాడంబరంగా నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్-గౌతమ్‌ కిచ్లూలు‌ అక్టోబర్‌ 30న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ నేపథ్యంలో హనీమూన్‌ కోసం మాల్దీవులకు పయనమవుతున్నట్లు గతవారం కాజల్‌ ప్రకటించింది. ఇక అప్పటి నుంచి కాజల్‌ మాల్దీవులలో భర్త గౌతమ్‌తో కలిసి సందడి చేస్తున్న ఫొటోలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటూనే ఉంది. అదే విధంగా బుధవారం కూడా అభిమానుల కోసం మరిన్ని ఫొటోలను షేర్‌ చేసింది కాజల్‌. వారుంటున్న రిసార్ట్‌ సమీపంలోని స్వీమ్మింగ్‌ పూల్ వద్ద టీ తాగుతూ, యోగ చేస్తున్నవి, తన బర్త గౌతమ్‌ కలిసి ఫొటోలకు ఫోజ్‌​ ఇచ్చిన అందమైన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో‌ పోస్టు చేసింది. ఈ ఫొటోలకు ‘ఈ అందమైన దేశానికి ఎప్పుడూ వచ్చిన నా హృదయం సంతోషంతో ఉల్లాసంగా ఉంటుంది’ అనే క్యాప్షన్‌ను జత చేసింది. (చదవండి: హనీమూన్‌కు వెళుతున్న కొత్త జంట)

 ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

My heart feels so happy and free, everytime I visit this beautiful country ! 🇲🇻

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

కాగా మెగాస్టార్‌ చిరంజీవితో దర్శకుడు కొరటాల శివ రూపోందిస్తున్న‘ఆచార్య’ సినిమాలో కాజల్‌ ఫిమేల్‌ లీడ్‌ రోల్‌ చేస్తుంది. ఇటీవల షూటింగ్‌లు పున: ప్రారంభం కావడంతో ఈ సినిమా సెట్స్‌లోకి వెళ్లింది. అయితే కాజల్‌ పెళ్లి తర్వాత కొద్ది రోజులు మాత్రమే విశ్రాంతి తీసుకుంటుందని ఆ తర్వాత ‘ఆచార్య’ షూటింగ్‌లో పాల్గొంటుందని ఆమె పెళ్లి సమయంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో తమ అభిమాన కాజల్‌ను‌ త్వరలోనే స్ర్కీన్‌పై‌ చూడోచ్చని అభిమానులు సంబర పడిపోయారు. అయితే ఆ వార్తలను కొట్టి పారేస్తూ కాజల్‌ తన హనీమూన్‌ ప్రయాణాన్ని ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక ‘ఆచార్య’ షూటింగ్‌లో కాజల్‌ ఎప్పుడు పాల్గొంటుందా అని ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. (చదవండి: కాజల్‌ అగర్వాల్‌ వెరీ వెరీ స్పెషల్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు